Breaking News

సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని నగర ప్రజల‌కు నగర మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అవగాహన కల్పించారు. మంగళవారం నగరంలోని 34వ డివిజన్‌ మిర్చి కంపౌండ్‌ ఏరియాలో ఇంటింటికి వెళుతూ ప్రజల‌కు సీజనల్‌ వ్యాధుల‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల‌ పరిశుభ్రత విషయంలో బాధ్యత తీసుకోవాల‌ని, తడి పొడి చెత్త వేరు చేయాల‌ని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువుల‌లో నీరు నిలువ‌ ఉండకుండా చూడాల‌ని, తద్వారా దొమల‌ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. అలాగే ఇందూరు యువత అసోసియేషన్‌ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలో నిలువ‌ ఉన్న నీటిని తొల‌గించాల‌ని తెలిపారు. పలు వీధుల్లో ఇంటి ఆవరణలో నిలువ‌ ఉన్న నీటిని పరిశీలించి లార్వాను గుర్తించి పారబోశారు. ప్రజలందరూ సహకరించి సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని తెలిపారు. ప్రతిరోజు ఇందూరు యువత అసోసియేషన్‌ సీజనల్‌ వ్యాధుల‌పై ప్రజల‌కు అవగాహన కల్పించడం అందరికీ ఆదర్శమన్నారు.

కార్యక్రమంలో 34వ డివిజన్‌ కార్పొరేటర్ క‌ల్ప‌నా మల్లేష్‌. ఎంహెచ్‌ఓ డా.శ్రీనివాస్‌, ఇందూరు యువత అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు, ఇందూర్‌ యువత సభ్యులు, నగరపాక సిబ్బంది, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ ...

Comment on the article