Breaking News

నిజామాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల‌ దండు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల‌లో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ పలు సూచనలు చేస్తుంది.

వార్దా ప్రాంతంలో మిడతల‌ దండు ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందని తెలుస్తున్నందున రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. మిడతల‌ దండు పంటపై దాడిచేస్తే పంటకు తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల‌లో మిడతలు విజృంభిస్తూ గాలితో పాటు అతి తక్కువ సమయంలోనే దూర ప్రాంతాల‌కు పయనిస్తూ ఉంటాయని పేర్కొన్నారు.

విడతల‌ దండు గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలితో పాటు సరిహద్దు దాటి పయనిస్తుందన్నారు. సాధారణంగా ఇక్కడ కనిపించే మిడతల‌ను ఎడారి మిడతలుగా పిలుస్తారు, మిడతలు దాదాపు అన్ని పంటల‌పై దాడి చేసి తింటాయన్నారు.

సమగ్ర మిడతల‌ యాజమాన్య చర్యలు :

1. మిడతలు పరిసర ప్రాంతాల‌లో గమనించినట్లయితే తమ పంటలోకి రాకుండా రైతులు డబ్బాలు, మెటల్‌ ప్లేట్‌లు లేక డ్రమ్ముల‌తో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం లేక రేడియో మ్రోగించడం, ఎల‌క్ట్రానిక్‌ పరికరాల‌తో శబ్దాలు చేయడం ద్వారా రక్షించుకోవాలి.

2. వేప రసాయనాలు (0.15 శాతం ఈసి) 45 మి.లీ. / 15 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి.

3. క్వినాల్‌ ఫాస్‌ 1.5 శాతం డిపి పొడి మందు లేక క్లోరోఫైరిఫాస్‌ 1.5 శాతం డిపి లేక 25 కిలోలు హెక్టారుకు చొప్పున పంటపై చల్లి మిడతల‌ బారి నుండి రక్షించుకోవచ్చు.

4. సాగుచేయబడిన పొలాల‌లో మిడతల‌ గుడ్ల దశను గమనించిన ఎడల‌ క్వినాల్‌ ఫాస్‌ 1.5 శాతం డిపి లేక క్లోరోఫైరిఫాస్‌ 1.5 శాతం డిపి కెలాథియాన్‌ పొడిమందును 25 కిలోలు హెక్టారుకు చొప్పున చల్లి, పొలాన్ని దున్నడం ద్వారా గ్రుడ్లు, పిల్ల‌ పురుగుల‌ను నాశనం చేయవచ్చు.

5. పొలాల‌ చుట్టు ప్రక్కల‌ను మంటల‌ను వేసి మిడతల‌ దండు లేక పిల్ల‌దశ పురుగులు మంటలో పడి నాశనం అయ్యేటట్లు చేయవచ్చు.

Check Also

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ ...

Comment on the article