Breaking News

రైతు సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు పంటల‌ మార్పిడికి సంబంధించి, రైతు రుణ మాఫీ, వాన కాలం పంట వేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి రైతు బంధు రైతు ఖాతాలో వేయాల‌ని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పంట మార్పిడి చేయమని చెప్తున్న దానిపై ఏమైనా శాస్త్రీయ పరిశోధనలు చేసిందా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా రైతు భూమిలో భూసారా పరీక్షలు చేసి వ్యవసాయ అధికారులు వాటిపై రైతుల‌కు వివరించాల‌న్నారు.

జిల్లాలో దాదాపు 80 వేల‌ ఎకరాల్లో పండిరచే మక్క పంటను వద్దని అంటే రైతులు, మేత లేక పశువులు కూడా ఇబ్బంది పడతాయని అన్నారు. పత్తి, సోయాకు మద్దతు ధర ప్రకటించాల‌ని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా 4 నెలల‌ క్రితం కొనుగోలు చేసిన కందు డబ్బులు రైతుల‌కు చెల్లించాల‌న్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article