Breaking News

రిటైర్డ్‌ ఐఏఎస్‌ఉమాపతి రావు కన్నుమూత

కామారెడ్డి, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ వాసి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పలు జిల్లాల‌కు కలెక్టర్‌గా పనిచేసిన కామినేని ఉమాపతి రావు (92) బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. గురువారం దోమకొండలో ఉమాపతి రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమాపతి రావు కొడుకు అనిల్‌ కుమార్‌ కూతురు ఉపాసన సినీ నటులు చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ను పెళ్లి చేసుకున్నారు.

పలు జిల్లాల‌కు కలెక్టర్‌గా పనిచేసినపుడు అప్పటి ఎల‌క్ట్రిసిటీ చైర్మన్‌గా పనిచేశారు. తిరుమల‌ తిరుపతి దేవస్థానం ఈవోగా చేశారు. ఉమాపతి రావు స్వస్థలం దోమకొండ. దోమకొండ సంస్థానాన్ని ఆయన పూర్వీకులు 400 ఏళ్ల పాటు పాలించారు. అపోలో హాస్పిటల్స్‌, అపోలోఫార్మసీ, ఇతర అనేక వ్యాపారాల‌ను కుటుంబం నిర్వహించింది.

ఉమాపతి రావుకు అనిల్‌ కుమార్‌ ఒక్కడే కుమారుడు. 1928లో జన్మించిన ఉమాపతి రావు నీతి నిజాయితీతో గొప్ప వ్యక్తిగా జీవించారని రామ్‌ చరణ్‌ భార్య, మనుమరాలు ఉపాసన పేర్కొన్నారు. చనిపోయిన ఉమాపతి రావు ఉర్దూ భాషలో కవితలు రాశారని ఉపాసన పేర్కొన్నారు. ఉమాపతి రావుకు భార్య పుష్పలీల‌, కొడుకు అనిల్‌ కుమార్‌ ఉన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article