Breaking News

పాత హాల్‌ టికెట్లతోనే పరీక్షలు

కామారెడ్డి, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఫలితాలు సాధించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు కొత్త సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

మండలాల‌ వారీగా సమీక్ష నిర్వహించారు. కొత్త సెంటర్లలో ఉన్న విద్యార్థుల‌కు చరవాణి ద్వారా సమాచారం అందించాల‌ని, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాల‌ ఉపాధ్యాయుల‌ను, ప్రధానోపాధ్యాయుల‌ను సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. 8 నుంచి పదో తరగతి పరీక్షలు తిరిగి ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల‌ను నిత్యం ఉదయం పూట చరవాణి ద్వారా సమాచారం అందించి చదువుకునే విధంగా చూడాల‌ని సూచించారు.

మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఇతర గ్రామాల‌ నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పాత హాల్‌టికెట్‌ ద్వారానే విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. సమావేశంలో పరీక్ష ఇన్చార్జ్‌ నీలి లింగం, వివిధ మండలాల‌ ఎంఈఓలు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article