Breaking News

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ఉన్నదని, తల‌సేమియా వ్యాధితో బాధపడుతున్న వారి గురించి తెలుసుకున్న నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ స్పందించారు. 11వ డివిజన్‌ యువకుల‌ను ప్రోత్సహించి రక్త దానం చేయవసిందిగా కోరారు. కాగా గురువారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో 10 మంది యువకులు రక్త దానం చేశారు.

మేయర్‌ కుమార్తె కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్త దానం గురించి రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్‌ స్పందిస్తూ మేయర్‌ విషయం తెలుసుకుని స్వయంగా బ్లడ్‌ బ్యాంక్‌కు వచ్చి తన కుమార్తె ద్వారా రక్త దానం చేయించటమే కాకుండా యువకుల‌తో రక్త దానం చేయించడం గొప్ప విషయమన్నారు. రక్తలేమితో బాధ పడుతున్న రోగుల‌ను ఆదుకోవడానికి నగర ప్రజలు ముందుకు రావాల‌ని కోరారు.

Check Also

జూలై 25 వరకు పూర్తిచేస్తాం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో వైకుంఠ ధామాన్ని గ్రామంలోని ...

Comment on the article