Breaking News

నాలుగైదు రోజుల్లో ప్రణాళిక ఇస్తాము…

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామంలో గురువారం రైతుకు లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు నష్ట పోకుండా పండిరచిన పంటల‌ను లాభసాటిగా సకాలంలో విక్రయించుకునేలా చేసేందుకు ఉద్దేశించిందే ఈ కార్యక్రమమని, డిమాండ్‌ లేని పంటలు పండిరచి నష్టపోవడం కంటే, డిమాండ్‌ ఉన్న పంటలు ఆయా ప్రాంతాల‌లోని వాతావరణ పరిస్థితుల‌కు అనుగుణంగా పండిరచేలా రైతుకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందే ఈ కార్యక్రమం అన్నారు.

ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ తమ అభిప్రాయాల‌ను జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. గ్రామంలో విభిన్నమైన నేల‌లు, ఎర్ర నేల‌లు, చౌడు నేల‌లు ఉన్నవని, గతంలో సోయా, కంది పంటల‌కు దిగుబడి రాలేదని, రైతుకు దిగుబడి వచ్చేలా సూచనలిస్తే, ఏ పంట నైనా వేస్తామని తెలిపారు. గ్రామంలో సాగునీరు లేదని, గుత్ప లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు తొందరగా పూర్తిచేయాల‌ని కోరారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ ఇంకా రాలేదని, మనని మనము కాపాడుకోవాల‌ని, కొంతమందికి వైరస్‌ ఉన్నా తెలియదని, వారి ద్వారా పెద్ద వారికి సోకితే ఇబ్బందికరంగా ఉంటుందని, షుగర్‌, బిపి, హార్ట్‌, కిడ్నీ ప్రాబ్లమ్‌ ఉన్న వారికి తొందరగా సోకుతుందని తెలిపారు. వర్షాకాలంలో తొందరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్‌ వచ్చేవరకూ మనల్ని మనం కాపాడుకోవాల‌ని తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్‌ ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటీజర్లు వాడాల‌ని సూచించారు.

రైతు పరిస్థితి బాగు కావాల‌ని, ప్రస్తుతం మొక్కజొన్న పంటకు డిమాండ్‌ లేదని, రాష్ట్ర గోడౌన్‌లో 25 ల‌క్షల‌ క్వింటాళ్ళ మొక్కజొన్న నిలువ ఉన్నదని, దాని స్థానంలో వేరే పంటలు వేసుకోవాల‌ని, నేల‌లు, వాటర్‌ అనుకూలంగా వ్యవసాయ శాఖ అధికారులు పంటలు సూచిస్తారని అన్నారు. రాష్ట్రంలో నిజామాబాదు రైతులు చాలా ముందు ఉన్నారని, డిమాండ్‌ మేరకు లాభసాటి పంటలు పండిస్తే రైతు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు.

డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైతులు పండిరచిన పంటల‌కు ధర వస్తుందని తెలిపారు. రైతుకు ఇబ్బంది పెట్టాల‌ని ప్రభుత్వం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో కూరగాయలు 400 మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రస్తుతం 200 మెట్రిక్‌ టన్నులు మాత్రమే పండుతున్నాయని, మిగతావి మహారాష్ట్ర నుండి వస్తున్నాయని, కూరగాయల‌ పంటకు 4, 5 రోజుల‌లో ఒక ప్రణాళిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమానికి ఆర్మూర్‌ ఆర్‌డిఓ, జక్రాన్‌ పల్లి ఎమ్మార్వో, ఎండిఓ, జెడ్‌పిటిసి, ఎంపీటీసీ సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూలై 25 వరకు పూర్తిచేస్తాం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో వైకుంఠ ధామాన్ని గ్రామంలోని ...

Comment on the article