Breaking News

సౌదీలో యజమాని చిత్రహింసలు…

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌కి మాజీ ఎంపీ కవిత ఫోన్‌ చేయడంతో ఎంబసీ అధికారులు, జాగృతి భాద్యుల‌ సహకారంతో అంకమొల్ల‌ రవి పోలీసుల‌ను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మే24 న తీవ్ర గాయాల‌తో అంకమొల్ల‌ రవి సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని వీడియో సందేశం పంపాడు. అదే రోజు ఉదయం మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల కవిత సౌదీ అరేబియాలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌తో మాట్లాడి త్వరగా చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

అదే రోజు సాయంత్రం ఎంబసీ అధికారుల నుండి రవి కుటుంబ సభ్యుల‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. కాగా బుధవారం ఉదయం మరోసారి యజమాని చేయిచేసుకోగా జాగృతి సౌదీ బాద్యులు ఇఫ్తెకార్‌ సూచనతో రవి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులు రాగా మనవాళ్ళు అక్కడే వారితో ఫోన్‌లో మాట్లాడారు. రవిని తీసుకువెళ్ళిన పోలీసులు అర్ధరాత్రి వరకు తమవద్దే ఉండమన్నారు.

నిన్న సాయంత్రం ఇఫ్తెకార్‌, ఎంబసీ అధీకారుల సూచన మేరకు పోలీస్‌ స్టేషన్‌ వెళ్ళిన సామాజిక కార్యకర్త సమీర్‌ రవిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టింది పోలీసుల‌కు వివరించి ఫోటోలు చూపెట్టారు. ఎంబసీ అధికారుల‌కు కూడా నిన్నటి పరిస్థితి వివరించి పోలీసుల‌కు ఫోన్‌ చేయించారు. పూర్తి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు లాక్‌ డౌన్‌ పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎంబసీ అధికారులు కూడా లాక్‌ డౌన్‌ పూర్తి కాగానే ఎంబసీకి తీసుకువస్తామని తెలిపారు.

అలాగే రవిపై చేయిచేసుకోకూడదని పోలీసులు రవి కఫీల్‌ను హెచ్చరించారు. ఎంబసీ అధికారులు, జాగృతి భాద్యులు రవి యజమానితో మాట్లాడారు. రవి ఇపుడు తన కఫీల్‌ వద్దే ఉన్నాడు. రెండు నెలల‌ జీతం బకాయిలు కూడా ఇచ్చేయాల‌ని కఫీల్‌కు పోలీసులు చెప్పారు. గురువారం మరోసారి సమీర్‌ పోలీసుల‌ను కల‌వనున్నారు. త్వరలోనే రవి స్వదేశానికి క్షేమంగా రావాల‌ని కోరుకుందాం.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article