Breaking News

మేము డబ్బుకు అమ్ముడు పోలేదు

కామారెడ్డి, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేస్తున్న అభివృద్ధి పనుల‌కు ఆకర్షితుమై పార్టీ మారాము తప్ప డబ్బుకు అమ్ముడు పోలేదని ఎంపిటిసి ఫిరంగి రాజేశ్వర్‌ స్పష్టం చేశారు. గురువారం దోమకొండ తెరాస పార్టీ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు.

ఎంఎల్‌సి వొడ్డేపల్లి సుబాష్‌రెడ్డి తమ ఎంపిటిసిపై మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఇతరుల‌ ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవాల‌ని హెచ్చరించారు. కార్యక్రమంలో తెరాస మండల ప్రెసిడెంట్‌ ఐరేని నర్సయ్య, ఎంపీటీసీలు నిమ్మ శంకర్‌, కడారి రమేష్‌, కాటిపల్లి వెంకటల‌క్ష్మి, దోర్నాల‌ నాగరాజు, ల‌క్ష్మి-ల‌క్ష్మణ్‌, ఉపసర్పంచ్‌ గజవాడ శ్రీకాంత్‌, రైతుసమన్వయ అధ్యక్షుడు నర్సరెడ్డి, మన్నే సాయిరెడ్డి, శేఖర్‌, తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article