Breaking News

దూపల్లి ఆదర్శగ్రామంగా ముందుకు వెళ్ళాలి

నిజామాబాద్‌, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ విధానం మారాల‌ని, ఎక్కువ డిమాండ్‌ ఉన్న సన్న వరి, పత్తి, సోయా వంటి రకాలు సాగు చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలం దూపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన ‘‘లాభసాటి వ్యవసాయంపై అవగాహనా సదస్సు’’లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాల‌ని, కొత్త కొత్త విధానాలు అమలు చేయాల‌న్నారు.

ఈ యేడు వానాకాలం నుంచి డిమాండ్‌ ఉన్న పంటలు పండిరచాల‌ని, అలా పండిస్తేనే భవిష్యత్తులో రైతుకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వం రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేపడుతుందని, దొడ్డు వరి రకాల‌కు డిమాండ్‌ లేదని, అవసరానికి మించి పండిస్తున్నారని అందుకే గిట్టుబాటు ధర రావటం లేదని, కరోనా దృష్ట్యా రైతు ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యాసంగి పంట మొత్తాన్ని కొనుగోలు చేసిందని, వానాకాలం పంటలో దొడ్డు వరి రకం తగ్గించి డిమాండ్‌ ఉన్న సన్నవరి రకాలు పండిరచాల‌ని, అలాగే మొక్కజొన్న డిమాండ్‌ను మించి గోదాముల్లో నిలువ‌ ఉన్నదని, ఈ పంటకు ప్రత్యామ్నాయంగా సొయా, కంది వంటి పంటలు వేయాల‌ని, సన్న వరి రకాల‌కు మీ గ్రామంలో అనుకూల‌ పరిస్థితులు ఉన్నాయని, మద్దతు ధర విషయం ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.

మన జిల్లాలో దూపల్లి ఆదర్శ గ్రామంగా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ ఉద్దేశము భవిష్యత్తులో పంట విధానం ఏ విధంగా ఉంటే రైతుకు, ప్రభుత్వానికి ఇద్దరికీ మేలు జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు డిమాండ్‌ ఉన్న పంటలు పండిరచినప్పుడు రైతుకు సపోర్టు చేయాల‌నే అని, చాలామంది సన్న రకం బియ్యం తినడం వల‌న ఈ రకానికి అధిక డిమాండ్‌ ఉన్నదని, డిమాండ్‌ ఉన్న పంట పండిస్తే రైతుకు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉండదన్నారు. భూమి స్వభావం, నీటి ల‌భ్యతను దృష్టిలో పెట్టుకొని రైతు ఏ పంట వేయాలో వ్యవసాయ అధికారులు సూచించాల‌ని ఆదేశించారు.

గ్రామాల‌లో ఉన్న ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ, రైతుబంధు మెంబర్లు, అధికారులు రైతుకు పంటపై అవగాహన కల్పించాల‌న్నారు. రెండు సంవత్సరాల‌కు ఒకసారి పంట మార్పిడి జరగాల‌ని పంట మార్పిడి వల‌న తక్కువ ఎరువుతో పంటలు పండిరచే అవకాశం ఉందన్నారు. ఆర్గానిక్‌ పంటల‌కు ఎక్కువ డిమాండ్‌ ఉన్నదని రానున్న రోజుల్లో లేబర్‌ తగ్గిస్తూ పంటలు పండిరచే విధానానికి వెళ్లాల‌న్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు కూడా మారాల‌ని, ఆర్గానిక్‌ పంట రేటు ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యం కొరకు అందరూ ఆర్గానిక్‌ పంట ఉత్పత్తుల‌ను అడుగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శనిగరం సాయి రెడ్డి, జెడ్‌పిటిసి విజయ, పిఎసిఎస్‌ చైర్మన్‌ భూమారెడ్డి, ఏఓ ల‌క్ష్మీకాంత్‌, ఎమ్మార్వో అసదుల్లా, ఎంపీడీవో గోపాల‌కృష్ణ, ఏఈఓ సాయినాథ్‌ రైతు తదితరులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ ...

Comment on the article