Breaking News

అంబలి వితరణ

బాన్సువాడ, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాన్సువాడ పట్టణంలో పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో పోచారం భాస్కర్‌ రెడ్డి సూచన మేరకు 4వ రోజు ఉచితంగా అంబలి, మంచినీటి పాకెట్లు ప్రజల‌కు పంపిణీ చేశారు.

గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీల‌ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ రోజు వారీ పనుల‌ కోసం పట్టణం వచ్చే ప్రజల‌కు ఎండ వ‌ల్ల‌ వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల‌ దాహార్తి తీర్చేందుకు 5 వేల‌ అంబలి, మంచినీటి ప్యాకెట్లు పంచినట్టు తెలిపారు. ఎండాకాలం ఉన్నంత వరకు ప్రజల‌కు ఉచిత అంబలి మంచినీటిని పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ తెరాస పార్టీ అధ్యక్షుడు పాత బాల‌కృష్ణ, ఆర్‌బిఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల‌ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, కౌన్సిల‌ర్‌, రుక్మిణి హనుమంతు, తెరాస కార్యదర్శి వీరారెడ్డి, పిబిఆర్‌ యువసేన సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article