Breaking News

Daily Archives: May 30, 2020

అంబులెన్సులో సుఖ ప్రసవం

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్‌ రేణుక (26), ఆమెకి పురిటి నొప్పు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది తండాకి చేరుకుని, తక్షణమే రేణుకని హాస్పిటల్‌కు తరలిస్తుండగా పురిటి నొప్పు లు అధికం కావడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు. మూడవ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం ...

Read More »

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు నిర్వహించబోయే ‘‘ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం’’ పై సర్పంచ్‌లు, పంచాయతి కార్యదర్శులు, మండ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, డివిషనల్‌ పంచాయతీ అధికారుల‌కు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి మార్గదర్శకాలు సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన విడుదల‌ చేస్తూ రాబోయే వానాకాలంలో అతిసార, డయేరియా, డెంగ్యూ, చికెన్‌ గునియా, మలేరియా, టైఫాయిడ్‌ వంటి సీజనల్‌ వ్యాధులు ముఖ్యంగా ...

Read More »

కాలేశ్వరం నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు జల‌కళ‌

నిజాంసాగర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు లాభసాటి పంటలు వేసుకోవాల‌ని రాష్ట్ర రోడ్డు భవనాలు గృహనిర్మాణ శాసనసభ వ్యవహారాల‌ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట్‌ గ్రామంలో నిర్వహించిన లాభసాటి పంటపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాస్త్రవేత్తల‌తో చర్చించి తెలంగాణలో ఎలాంటి పంటలు వేసుకోవాల‌ని చర్చించి రైతులందరూ లాభసాటి పంటల‌ను వేసుకోవాల‌ని అన్నారు, ప్రభుత్వం సూచించిన మేరకు ...

Read More »

కాలువలో పూడిక, చెత్త తొల‌గించే పనులు ప్రారంభించాలి

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి, వర్ని, రుద్రూర్‌, చందూర్‌, మోస్రా మండలాల‌ ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో ‘‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం వర్ని మండల‌ కేంద్రంలోని సిసిడిలో జరిగిన సమీక్షా సమావేశంలో స్పీకర్‌ మాట్లాడుతూ… గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగునీటి ఉప కాలులు, చెరువు ఫీడర్‌ చానెల్‌ మరమ్మతులు చేయించుకోవాల‌ని సూచించారు. ప్రత్యేక నిధులు కెటాయించి ...

Read More »

జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు

హైదరాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాల‌ను జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. మొదట మే 31 వరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాల‌నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వర్షాలు రాక ముందే రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల‌కు తెచ్చి అమ్ముకోవాల‌ని సీఎం కోరారు.

Read More »

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ఉండేలా పంటలు పండించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో వ్యవసాయ శాఖ లాభసాటి వ్యవసాయంపై రైతుకు ఏర్పాటుచేసిన అవగాహనా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వానాకాలం పంట ప్రణాళికలు తయారైన తర్వాత రైతుల్లో రైతుబంధు వస్తదా, రాదా అన్న సందేహం కలుగుతోందని, రైతుబంధుకు, వానకాలం సాగు ప్రణాళికకు ఎలాంటి సంబంధం లేదని, ...

Read More »

వరవరావు, సాయిబాబాను విడుదల‌ చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విప్లవ రచయిత నాయకులు వరవరరావును, సాయి బాబాను జైలు నుండి విడుదల‌ చేయాల‌ని సీపీఐ సీనియర్‌ నాయకుడు విఎల్‌ నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డి సీపీఐ కార్యాల‌యంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జైలులో వున్న విప్లవ రచయితలు అనేక జబ్బుల‌తో బాధపడుతున్నారని, వరవరరావును వెంటనే విడుదల‌ చేయాల‌న్నారు. అదే విదంగా ఢల్లీి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా 90 శాతం అంగ వైక‌ల్యం కలిగి ఉన్నారని, సాయిబాబాను పెరోల్‌పై ...

Read More »

నిజామాబాద్‌కు శ్రామిక్‌ రైల్‌

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 404 మంది వల‌స కార్మికులు శనివారం మధ్యాహ్నం 2:25 నిమిషముల‌కు శ్రామిక్‌ రైల్లో నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారందరికీ హోం క్వారంటైన్‌కి అధికారులు స్టాపింగ్‌ చేశారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు సమాచారం. వల‌స కార్మికుల‌కు నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఆధ్వర్యంలో పళ్ళు, వాటర్‌ బాటిల్‌లు, మాస్కులు, శానిటైజర్‌లు ఇతర ఆహార సామాగ్రిని బిజెపి నాయకులు అందజేశారు. తదుపరి ట్రైన్‌ జగిత్యాల్‌, కరీంనగర్‌ బయల్దేరి వెళ్ళింది.

Read More »

జాకోరాలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ రోజు వర్ని మండలం జాకోరా గ్రామంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మదన్‌ మోహన్‌ రావు సేవా (ట్రస్ట్‌) సంఘం సౌజన్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్‌ రసాయనం, సోడియం హైపోక్లోరైడ్‌ పూర్తిస్థాయిలో పిచికారీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కునిపూర్‌ రాజారెడ్డి, మండల‌ అధ్యక్షుడు నారాయణ, మాజీ జడ్పీటీసీ రాంజనాయక్‌, ఎంపీటీసీ ఎండుగుల‌ సాయిలు, సొసైటీ డైరెక్టర్‌లు బంజ గంగారాం, నరెడ్ల సాయిలు, ...

Read More »

మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంది…

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గం, నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంలో లాభసాటి పంట సాగుపై రైతుల‌కు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ వైరస్‌ ఇంకా పోలేదు.. దయచేసి ఇప్పుడు మనమందరం జాగ్రత్త పడాల‌ని, ఇన్ని రోజులు ముఖ్యమంత్రి దేశంలోనే అందరికంటే ముందే వైరస్‌ను గుర్తించి నిర్ణయం ...

Read More »

అధికారుల‌ సేవల్ని కొనియాడిన మేయర్‌

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ విరమణ చేస్తున్న మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు జందర్‌ రెడ్డి డి.సి.పి, ఎం.ఏ రషీద్‌ డిప్యూటి ఇఇ, ఎం.ఏ షూకుర్‌ డిప్యూటి ఇఇ ల‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ సన్మానించారు. నిజామాబాద్‌ నగర అభివృద్దికి ఎంతో కృషి చేసిన అనుభవజ్ఞులైన అధికారులు ఉద్యోగ విరమణ చేస్తున్న నేపథ్యంలో వారి సేవల‌ను కొనియాడారు. నగర మున్సిపాలిటీ అనుభవజ్ఞులైన‌ అధికారుల‌ సేవల‌ను కోల్పోవటం బాధాకరమని ఇప్పుడు పని చేస్తున్న అధికారులు ఈ ...

Read More »