Breaking News

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ఉండేలా పంటలు పండించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో వ్యవసాయ శాఖ లాభసాటి వ్యవసాయంపై రైతుకు ఏర్పాటుచేసిన అవగాహనా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

వానాకాలం పంట ప్రణాళికలు తయారైన తర్వాత రైతుల్లో రైతుబంధు వస్తదా, రాదా అన్న సందేహం కలుగుతోందని, రైతుబంధుకు, వానకాలం సాగు ప్రణాళికకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ ఉద్దేశం మనం తీసుకున్న పంటసాగు విధానం ద్వారా రానున్న రోజుల్లో రైతు స్థాయి పెరగాలి అనే తప్ప తగ్గించే ఉద్దేశం లేదన్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల‌ వారీగా వానాకాలంలో పండిరచే పంటపై ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి వ్యవసాయ శాఖ సూచనలు సల‌హాలు ఇస్తుందన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలు వేయడం వల‌న మార్కెట్‌లో ఈజీగా అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని కలెక్టర్‌ అన్నారు.

పండిరచిన పంటను అమ్ముకోడానికి రైతుకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకే ప్రణాళిక అన్నారు. ఉదాహరణకు మన జిల్లాలో ఆరు నియోజకవర్గాల‌లో బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గ ఏరియాలో సన్న రకాలు ఎక్కువ పండిస్తున్నారని, నిజామాబాద్‌ రూరల్‌లో దొడ్డు రకాలు పండిస్తున్నారని, బాల్కొండ నియోజకవర్గంలో మిశ్రమ పంటలు పండిస్తున్నారని, బాన్సువాడ, బోధన్‌ ఏరియాలో ధాన్యం కొనుగోలు పూర్తయి నెల‌ రోజులు అవుతుందని, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఇంకా కొనుగోలు నడుస్తుందని, దానికి కారణం సన్న బియ్యానికి డిమాండ్‌ ఉండడమే అన్నారు.

రైతు క్షేమం కోరి దొడ్డు రకాలు మొత్తం ప్రభుత్వమే కొన్నదని, ప్రభుత్వం ద్వారా ఖర్చు చేసిన డబ్బు ప్రజల‌దే అన్నారు. మనం డిమాండ్‌ లేని పంటల‌ను పండిస్తూ పోతే ఆ పంట కొని ఏం చేయాలి, బియ్యం రేషన్‌ షాపు ద్వారా తెల్ల‌ కార్డు దారుల‌కు రూపాయికి కిలో చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక రూపాయకు కిలో బియ్యంపై ప్రభుత్వం 27 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు.

అయినా కొంత మంది మాత్రమే తింటున్నారని, మిల్ల‌ర్స్‌ కొన్ని రకాల‌ బియ్యాన్ని ఇతర దేశాల‌కు ఎగుమతి చేస్తున్నారు, కొన్ని దేశాలు బియ్యంలో రసాయన ఎరువుల‌ శాతం పరిశీలించి కొంటున్నారని, అందుకే రానున్న రోజుల్లో వ్యవసాయ విధానం మారబోతుందని, ఆర్గానిక్‌ పంటకు ఎక్కువ డిమాండ్‌ వస్తుందన్నారు. ప్రజల‌కు ఆరోగ్యాన్ని అందించే పంటల‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలు పండిరచడం వల‌న రైతాంగానికి మార్కెట్‌ ఇబ్బంది ఉండదని, వారు పండిరచిన పంటల‌ను త్వరగా అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు.

అనంతరం రైతుల‌తో ముఖ్యమంత్రి విధానాల‌కు అనుగుణంగా పంటలు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడిఎ గోవింద్‌, ఏఓ హరికృష్ణ, ఎంపీడీవో గోపి బాబు, సింగిల్‌ విండో చైర్మన్‌ హేమంత్‌ రెడ్డి, ఎంపిటిసి సురేష్‌, తహసీల్దార్‌ సంజయ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article