Breaking News

జాకోరాలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

బాన్సువాడ, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ రోజు వర్ని మండలం జాకోరా గ్రామంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మదన్‌ మోహన్‌ రావు సేవా (ట్రస్ట్‌) సంఘం సౌజన్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్‌ రసాయనం, సోడియం హైపోక్లోరైడ్‌ పూర్తిస్థాయిలో పిచికారీ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కునిపూర్‌ రాజారెడ్డి, మండల‌ అధ్యక్షుడు నారాయణ, మాజీ జడ్పీటీసీ రాంజనాయక్‌, ఎంపీటీసీ ఎండుగుల‌ సాయిలు, సొసైటీ డైరెక్టర్‌లు బంజ గంగారాం, నరెడ్ల సాయిలు, నాయకులు దత్తు, ధతగౌడ్‌, మైనారిటీ మండల అధ్యక్షుడు ముజీబ్‌, వార్డుమెంబర్‌ లావణ్య గంగాధర్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు శ్రేణిగరం కిషన్‌, బోయిడీ ల‌క్ష్మణ్‌, అమ్మిరాజు పాల్గొన్నారు. గ్రామస్థుల‌ ఆధ్వర్యంలో పిచికారి వాహనాన్ని ప్రారంభించారు. ఇటువంటి సహకారం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అందిస్తున్న మదన్‌ మోహన్‌ రావ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article