Breaking News

వరవరావు, సాయిబాబాను విడుదల‌ చేయాలి

కామారెడ్డి, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విప్లవ రచయిత నాయకులు వరవరరావును, సాయి బాబాను జైలు నుండి విడుదల‌ చేయాల‌ని సీపీఐ సీనియర్‌ నాయకుడు విఎల్‌ నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డి సీపీఐ కార్యాల‌యంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జైలులో వున్న విప్లవ రచయితలు అనేక జబ్బుల‌తో బాధపడుతున్నారని, వరవరరావును వెంటనే విడుదల‌ చేయాల‌న్నారు. అదే విదంగా ఢల్లీి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా 90 శాతం అంగ వైక‌ల్యం కలిగి ఉన్నారని, సాయిబాబాను పెరోల్‌పై విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు.

కరోనా మూలంగా జైల్లో ఉన్న ఖైదీల‌ను ప్రభుత్వం విడుదల‌ చేస్తానని చెప్పిన తరుణంలో వరవరరావును, సాయిబాబాను పెరోల్‌పై విడుదల‌ చేయాల‌న్నారు. అదే విదంగా బీమా కారెగాం తప్పుడు కేసులో నిర్బంధించిన న్యాయవాదుల‌ను సురేంద్ర గాడ్లింగ్‌, సుధ భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరారీ, రోన వ్సిన్‌, ప్రోఫెసర్‌ షోమసేన్‌, గౌతమ్‌, ఆనంద్‌ త్తొంబేను వెంటనే బెయిల్‌పై విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు.

పౌరాహక్కుల‌ సంఘ నాయకుల‌కు ఏదైనా హాని జరిగితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాల‌న్నారు. వరవరరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కరోనా సందర్భంగా వారిని వెంటనే విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. లేదంటే వామపక్ష పార్టీల‌ను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌, జిల్లా సహాయ కార్యదర్శి పి.బాల‌రాజు, జిల్లా నాయకులు ఎస్‌ఆర్‌ శేఖర్‌, బండారి రాజిరెడ్డి, డి.అశోక్‌, ఎన్‌ శ్రీ రాములు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిలుక నరేష్‌ పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article