Breaking News

Daily Archives: May 31, 2020

సీజనల్‌ వ్యాధుల‌ నివారణకు సహకరించాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబల‌కుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నీరు నిలువ‌ ఉండకుండా చూసుకోవాల‌ని, పరిసరాల‌ను పరిశుభ్రంగా వుంచుకోవాల‌ని, సీజనల్‌ వ్యాధుల‌ నివారణకు సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో 36 వార్డు ఎన్జిఓ కాల‌నీలో ఆదివారం పది గంటల‌ పదినిమిషాల‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుండీలో వున్న నీటిని తొల‌గించి శుభ్రం చేసి నీరు పోశారు. మొక్కల‌కు ...

Read More »

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఉమాపతిరావుకు నివాళులు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 27న మరణించిన రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి కామినేని ఉమాపతిరావు పార్థివ శరీరంపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఆదివారం దోమకొండ కోటలో ప్రజల‌ సందర్శనార్థం ఉంచిన కామినేని ఉమాపతిరావు భౌతిక కాయాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ తో పాటు జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు తేజస్‌ నందలాల్‌ పవార్‌, ...

Read More »

పొగాకు ఉత్పత్తుల‌ నుండి యువతను కాపాడాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పొగాకు నిషేదిత దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ పోగాకు వాడటం వ‌ల్ల‌ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈయేడు పొగాకు ఉత్పత్తుల‌ వాడకం నుంచి యువతను కాపాడాల‌ని, వాటి వల‌న కలిగే దుష్పలితాల‌ నుండి రక్షించాల‌నే నినాదంతో పొగాకు నిషేదిత దినం జరుపుకుంటున్నట్టు తెలిపారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల‌ వాడటం వల‌న అనేక శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు యువత ...

Read More »

జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఉదయం 9 గంటల‌కు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు ఉదయం 8:30 గంటల‌కు అమరవీరుల‌ స్తూపం వద్ద స్పీకర్‌ నివాళుల‌ర్పిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం వెలుపల‌ ఉన్న తమ తమ కార్యాల‌యాల‌లో అధికారులు ఉదయం ...

Read More »

గంజాయి పట్టివేత

జగిత్యా, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చత్తీస్‌ ఘడ్‌ నుండి అక్రమంగా స్మగ్లింగ్‌ చేస్తున్న నాలుగు కిలోల‌ గంజాయిని సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీ పట్టుకొని ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నుండి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాల‌ సిసిఎస్‌ సిఐ ఆరిఫ్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో వారి సిబ్బంది ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రాయపట్నం చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. చత్తీస్‌ ఘడ్‌ ...

Read More »

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ లో భాగంగా బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీలోని చెత్త, వ్యర్ధాల‌ను తొల‌గించే పనులు దగ్గరుండి చేయించారు. రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో షాపులు, హోటల్‌ వ్యాపారులు చెత్త వేయడం చూసి స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను ...

Read More »

15 మంది రక్తదానం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్త నిలువ‌లు తగ్గడంతో కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో సదాశివనగర్‌ గ్రామానికి చెందిన యువకుల‌తో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన యువకులు 15 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలు మాట్లాడుతూ రక్తదానం చేసిన వారిలో సైనికులు కూడా ఉండడం అభినందనీయమని, ఒకవైపు దేశ రక్షణ కోసం పాటుపడుతూ మరొకవైపు ...

Read More »

రైతుల‌కు తీపి కబురు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘మిడతల దండు’ రూట్‌ మారింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల‌ దండు మధ్యప్రదేశ్‌ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400 కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల‌ దండు గాలివాటం ఆధారంగా శనివారం మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్‌ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనితో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మిడతల‌ దండు ప్రస్తుతం ...

Read More »

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఆదివారంతో లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాల‌ను కేంద్రం ప్రకటించింది. దశల‌వారీగా కొన్ని మినహాయింపుల‌ను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల‌ వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని ...

Read More »