Breaking News

సీజనల్‌ వ్యాధుల‌ నివారణకు సహకరించాలి

కామారెడ్డి, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబల‌కుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నీరు నిలువ‌ ఉండకుండా చూసుకోవాల‌ని, పరిసరాల‌ను పరిశుభ్రంగా వుంచుకోవాల‌ని, సీజనల్‌ వ్యాధుల‌ నివారణకు సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో 36 వార్డు ఎన్జిఓ కాల‌నీలో ఆదివారం పది గంటల‌ పదినిమిషాల‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కుండీలో వున్న నీటిని తొల‌గించి శుభ్రం చేసి నీరు పోశారు. మొక్కల‌కు నీరు పోశారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి విషజ్వరాలు ప్రబల‌కుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో నీరు నిలువ‌ వున్న పాత, పూల‌ కుండీల‌ను, కూల‌ర్లు, టైర్లు, డ్రమ్ముల‌ను శుభ్రపరచుకోవాల‌ని, తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టినట్లవుతుందని తెలిపారు.

మెప్మా సంఘాలు మహిళలు ఇళ్ల యజమానుల‌కు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు తేజస్‌ నందలాల్‌ పవార్‌, కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article