Breaking News

రైతుల‌కు తీపి కబురు

నిజామాబాద్‌, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘మిడతల దండు’ రూట్‌ మారింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల‌ దండు మధ్యప్రదేశ్‌ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400 కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల‌ దండు గాలివాటం ఆధారంగా శనివారం మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్‌ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు.

దీనితో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మిడతల‌ దండు ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. కాగా, గాలిదిశ మార్చుకుని మళ్లీ ఇటు వైపు వస్తాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, తెలంగాణకు వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అన్నారు.

అయితే ఒకవేళ అవి దిశ మార్చుకుని ఇటు వైపు వచ్చినా వాటిని సంహరించేందుకు సరిహద్దుల్లో రసాయనాలు, అగ్నిమాపక యంత్రాల‌ను ఇప్పటికే సిద్దం చేసి ఉంచామని అధికారులు వెల్ల‌డిరచారు. కాగా, మిడతల‌ దండును సంహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article