Breaking News

జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం

కామారెడ్డి, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2 వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఉదయం 9 గంటల‌కు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు ఉదయం 8:30 గంటల‌కు అమరవీరుల‌ స్తూపం వద్ద స్పీకర్‌ నివాళుల‌ర్పిస్తారని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం వెలుపల‌ ఉన్న తమ తమ కార్యాల‌యాల‌లో అధికారులు ఉదయం 8 గంటల‌ లోపు జాతీయ పతాక ఆవిష్కరణ గావించాల‌ని, జిల్లాలోని అందరు అధికారులు సిబ్బంది ఉదయం 8.30 గంటల‌కు జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో జరిగే పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల‌ని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాల‌ని కలెక్టర్‌ ప్రకటనలో సూచించారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article