Breaking News

పొగాకు ఉత్పత్తుల‌ నుండి యువతను కాపాడాలి

కామారెడ్డి, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పొగాకు నిషేదిత దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ పోగాకు వాడటం వ‌ల్ల‌ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈయేడు పొగాకు ఉత్పత్తుల‌ వాడకం నుంచి యువతను కాపాడాల‌ని, వాటి వల‌న కలిగే దుష్పలితాల‌ నుండి రక్షించాల‌నే నినాదంతో పొగాకు నిషేదిత దినం జరుపుకుంటున్నట్టు తెలిపారు.

పొగాకు, పొగాకు ఉత్పత్తుల‌ వాడటం వల‌న అనేక శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు యువత పాటించాల‌ని, పొగాకు ఉత్పత్తులు, వివిధ రంగులు, వాసన, కృత్రిమ పదార్థాలు పిల్ల‌ల‌కు, యువకుల‌కు వాడటానికి ప్రోత్సహిస్తున్న మార్కెట్‌ ప్రచారాల‌ను నమ్మవద్దన్నారు. బహిరంగ ప్రదేశాల‌లో పొగ త్రాగరాదు, ఉమ్మి వేయరాదన్నారు. అదేవిధంగా కరోనా నియంత్రణలో అందరు భాగస్వాములు కావాల‌న్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article