Breaking News

Monthly Archives: June 2020

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ఒరిస్సా ప్రాంత ప్రజల‌కు విశ్వహిందూ పరిషత్‌ అండగా ఉంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తల‌ను సంప్రదించాల‌ని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం మియాపూర్‌లో సమావేశం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాల‌స్వామి, బజరంగ్‌ దళ్‌ స్టేట్‌ కో కన్వీనర్‌ శివ రాము, భారతీయ జనతా ...

Read More »

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ద్విచక్రవాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు మొత్తం రోడ్ల పై నిలిచింది. ఇక మొత్తం వర్షాకాలం వచ్చి భారీగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More »

రైతు వ్యతిరేక ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు ఏఐకెఎస్‌ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల‌ చేసిన వ్యవసాయ సంబంధిత రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల‌ని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాల‌యంలోని ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐకెఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, జూకంటి సుధాకర్‌ రెడ్డి, ...

Read More »

డబ్బు కోసం హత్యలు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 26 వ తేదీన బీడీ వర్కర్స్ కాల‌నీలో జరిగిన సుధాకర్‌, ల‌క్ష్మయ్య జంట హత్యల‌కేసు విషయంలో నిందితులు బెజ్జంకి విఘ్నేష్‌ కుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు. చెడు అల‌వాట్లకు బానిసైన విఘ్నేష్‌ డబ్బు కోసం హత్యలు చేసినట్టు వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌ తన వెంట షటిల్‌ బ్యాట్‌ కవర్‌లో తెచ్చిన గొడ్డలితో నరికి చంపినట్టు జిల్లా ఎస్పీ వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌కు గతంలో కామారెడ్డి ...

Read More »

శ్రీనగర్‌లో హరితహారం

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం 6వ విడత హరితహారం కార్యక్రమంలో వర్ని మండలంలోని శ్రీనగర్‌ గ్రామం వద్ద వర్ని-నిజామాబాద్‌ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమములో తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి ల‌క్ష్మీ వీరాజు, ఏఎంసి అధ్యక్షుడు సంజీవు, ప్యాక్స్‌ చైర్మన్‌ నామా సాయిబాబు, సర్పంచ్‌ రాజు, వైస్‌ ఎంపీపీ బారాజు, కో ఆప్షన్‌ సభ్యు కరీం, ఎంపిడివో, ...

Read More »

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తెరాస నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోన వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సూచనల‌ను పాటిస్తూ నిత్యం చేతుల‌ను శుభ్రం ...

Read More »

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల‌మైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల‌ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు అరోపించారు. కరోనా వ‌ల్ల‌ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో ల‌క్షల‌ సంఖ్యలో కరోనా టెస్ట్‌లు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 50 వేల‌ కరోనా టెస్ట్‌లు కూడా చేయడం లేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో ...

Read More »

రెండు వేల‌ జరిమానా విధించాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని, వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని, వారికి గ్రామస్తులంతా సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ మండలం ఇందల్వాయి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామములో జరుగుతున్న పారిశుద్ధ్య, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, పార్క్‌ స్థలం, నర్సరీ, హరితహారం పనుల‌ను పరిశీలించారు. మొదట గ్రామంలో తిరిగి ...

Read More »

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ప్రహారి గోడ కూలిన దుర్ఘటనలో బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని కేటాయించి మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, రాష్ట్ర తెరాస పార్టీ యువనాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి గృహ ప్రవేశం చేయించారు. గత నెల‌ జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా ముగ్గురు అమ్మాయిలు గాయపడ్డారు. ముగ్గురు అమ్మాయిల‌కు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం ...

Read More »

రెండు వందల‌కు పైగా దేశాల‌లో సేవా కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన ల‌యన్స్‌ సేవా ట్రస్టు భవన్‌ ప్రారంభమైంది. ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 324 డి గవర్నర్‌ ఇరుకుల‌ వీరేశం సోమవారం సాయంత్రం ట్రస్ట్‌ భవన్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ల‌యన్స్‌ క్లబ్‌లు రెండు వందల‌కు పైగా దేశాల‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల‌ను మరింత విస్తరించేందుకు ల‌యన్స్‌ భవన్లు నిర్మించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ...

Read More »

అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారు

మాక్లూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల‌ బిజెపి సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలా శివరాజ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. బిజెపి ఎదుగుదల‌ను చూసి ఓర్వలేక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, వారి మాటల‌ను ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధుల‌ను దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుల‌కు దమ్ము ధైర్యం ...

Read More »

శనివారం వరకు టార్గెట్‌ పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాలు, హరితహారం, రైతు వేదికల‌పై జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి జిల్లా అధికారి టార్గెట్‌ ఓరియంటెడ్‌గా పనిచేయాల‌న్నారు. ప్రభుత్వ భూములు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ రెవిన్యూ ప్రాపర్టీస్‌ రికార్డులో వచ్చే సోమవారం వరకు ప్రాపర్టీస్‌ పహానితో ఉండాల‌న్నారు. వచ్చే సోమవారం ప్రతి శాఖకు సంబంధించిన ప్రాపర్టీస్‌ పహానితో మీటింగ్‌కు రావాల‌న్నారు. ఈ వారం ...

Read More »

ఎస్‌ఐని సన్మానించిన ముదిరాజ్‌ సంఘం సభ్యులు

నందిపేట్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నందిపేట మండలంలో నూతన ఎస్‌ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన శోభన్‌ బాబుని నందిపేట ముదిరాజ్‌ సంఘం స‌భ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మాల‌తో సన్మానించారు. ముదిరాజ్ కుల‌స్తుల‌కు చేపలు పట్టే అధికారం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు మద్దుల‌ మురళి, డొంకేశ్వర్‌ లిప్టు వైస్‌ చైర్మన్‌ గంగరాము, నికాల్‌పూర్‌ లిఫ్టు డైరెక్టర్‌ రాజన్న, శ్రవణ్‌ కుమార్‌, నరేశ్‌ ...

Read More »

నష్టపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తాం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగారంలో గల‌ డబుల్‌ బెడ్రూమ్‌ సైట్‌ను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. సోమవారం నిజామాబాద్‌ నగరంలోని నాగారం, కొత్త కలెక్టరేట్‌ వెనకాల‌ నిర్మాణంలో ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ అనంతరం మాట్లాడుతూ నాగారం, భారత్‌ రాణిలోని సైట్లను పరిశీలించామని, 3 ఎకరాల‌ 39 గుంటల‌ స్థలంలో ఇండ్లు నిర్మించుటకు పనులు వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నిజామాబాద్‌ పట్టణంలో 2 వేల‌ 300 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ...

Read More »

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల‌ని, కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాల‌ని, కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాల‌ని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు, పివైఎల్‌, పివోడబ్ల్యు ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఆర్డీవో కార్యాల‌యం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. పివోడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, పద్మ పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, ప్రియాంక, దీపిక, నిమ్మ నిఖిల్‌, ...

Read More »

సంతానాన్ని కాపాడుకున్నట్లే మొక్కలు కాపాడుకోవాలి

బాన్సువాడ, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన సంతానాన్ని కాపాడుకున్నట్లే మొక్కల‌ను కాపాడుకోవాల‌ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గాంధారి ఎక్స్‌ రోడ్‌ పద్మాజివాడి నుండి బాన్సువాడ వరకు 45 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసలో 40 వేల‌ మొక్కలు నాటే కార్యక్రమంలో శాసనసభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటినీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, భూమి పంచభూతాల‌ను కాపాడుకోవాల‌ని, ...

Read More »

మీ గ్రామంలో నెమ్మదిగా జరుగుతుంది వెంటనే పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలం రాంనగర్‌ గ్రామాన్ని సందర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ గ్రామంలో జరుగుతున్న శానిటేషన్‌, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, పార్క్‌ స్థలం, హరితహారం పనుల‌ను పరిశీలించారు. మొదట గ్రామంలో తిరిగి పారిశుద్ధ్యం పనుల‌ను పరిశీలించిన అనంతరం శానిటేషన్‌ బాగుందని అన్నారు. ఊర్లో రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాల‌ని, వైకుంఠధామం పనులు రూరల్‌ మండలంలోని ...

Read More »

సామాన్యుల‌పై అసాధారణ భారం

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్ ధరల‌ పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు నియోజకవర్గ ఇంచార్జ్‌లు జుక్కల్‌ సౌదాగర్‌ గంగారాం, బాన్సువాడ కాసుల బాల‌రాజ్‌, ఎల్లారెడ్డి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పెంచిన పెట్రో ధరల‌ను వెనక్కితీసుకోవాల‌ని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ...

Read More »

బహుభాషా కోవిదుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాల‌యంలో మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీ.వీ. నరసింహారావు శతజయంతి వేడుకలు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ పి.వి.నరసింహారావు చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దివంగత ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞత, మానవీయ విలువల‌తో పాటు, పరిపాల‌నా దక్షత, ఆర్థిక సంస్కరణతో కూడిన ప్రజా పాల‌న ...

Read More »

పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యం మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొక్కలు నాటి నీరుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటాల‌ని ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ అదనపు ...

Read More »