Breaking News

Daily Archives: June 1, 2020

సిడి ఆవిష్కరించిన వల‌స కార్మికులు

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వల‌స కార్మికుల‌ కష్టాల‌ను తెలుపుతూ తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ రచించి రూపొందించిన ‘వల‌స కార్మికుల‌ గోస’ పాట ఆడియో సిడిని కామారెడ్డి జాతీయ రహదారిపై వల‌స కార్మికుల చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ పాటల‌ సిడిలో వల‌స కార్మికుల‌ కష్టాల‌ను పాటల‌ రూపంలో చెప్పడం జరిగిందన్నారు. వల‌సలు వెళుతున్న కార్మికులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారని, సమాజం, ప్రభుత్వం వారిని ఆదుకోవాల‌న్నారు. ...

Read More »

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు పెట్టుబడిదారీ కార్పోరేట్‌ శక్తుల‌కు ల‌బ్ధి చేకూరేలా ప్రకటించిన విధానాన్ని ఎంసిపిఐయు పార్టీ వ్యతిరేకిస్తుందని తన విధానాలు మార్చుకోవాల‌ని పార్టీ జిల్లా కార్యదర్శి రాజ లింగం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ సబ్సిడీలు యధావిధిగా కొనసాగించాల‌ని రైతుల‌ను ఆదుకునేందుకు స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలుచెయ్యాల‌ని అన్నారు. అసంఘటిత, నిర్మాణ కార్మికుల‌కు నెల‌కు పదివేలు మూడు నెలల‌పాటు ఇవ్వాల‌ని ఉపాధి హామీ పనిని ...

Read More »

నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్ అమలుకు జిల్లా స్థాయి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సూచనల‌కు అనుగుణంగా జిల్లాలోని మున్సిపాలిటీల‌లో పనితీరును జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్షించారు. జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లో 85 శాతం నుండి 90 శాతం ఇండ్లనుండి చెత్తను సేకరిస్తున్నారని, దాదాపు 70 శాతం చెత్తను సేకరణ కేంద్రాల్లో తడి, పొడి చెత్తగా విడతీస్తున్నారని అధికారులు తెలియచేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భీంగల్‌లో సేకరణ శాతం చాలా ...

Read More »

పరిశుభ్రత సామాజిక కార్యక్రమంగా భావించాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మురికి కాలువల‌లో పూడిక ఎప్పటికప్పుడు తీయాల‌ని, రోడ్లపై చెత్త, పిచ్చిమొక్కలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని 15, 16 ,17వ వార్డులో మురుగు కాలువల‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పరిసరాల‌ పరిశుభ్రతను సామాజిక కార్యక్రమంగా పట్టణ ప్రజలు భావించాల‌ని కోరారు. రోడ్లపై పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం లేకుండా చూడాల‌ని, మురుగు కాలువల్లో పూడిక ఎప్పటికప్పుడు తీయాల‌ని మునిసిపల్‌ ...

Read More »

సహకార బ్యాంకు ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ సహకార బ్యాంకుని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పని సరిగా మాస్కులు, చేతి గ్లౌసులు, స్యానిటైజర్లు వాడాల‌ని, బ్యాంకుకి వచ్చే కస్టమర్లకు చేతులు శుభ్రం చేసుకునేలా బ్యాంక్‌ బయట సానిటీజర్‌ అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

Read More »

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది వల‌స కూలీల‌ను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి 9 బస్సుల‌లో కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, సి పి కార్తికేయతో కలిసి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ఒరిస్సాకు చెందిన వల‌స కార్మికులు నిజామాబాద్‌ జిల్లా మండలం మోపాల్‌, మాక్లూర్‌ మండలాల‌లో ఇటుక బట్టీల‌లో పని చేసేవారని, వర్షాకాలం రావడంతో పని ముగిసిందని, ...

Read More »

రేపటి కార్యక్రమంలో భౌతిక దూరం పాటించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న జరుపుకోబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల‌ సందర్భంగా నగరంలోని వినాయకనగర్‌లో అమరవీరుల‌ స్థూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయతో కలిసి పరిశీలించారు. స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు పూర్తి కావాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. నివాళులు అర్పించే క్రమంలో భౌతిక దూరం పాటించాల‌ని, మాస్కులు ధరించాల‌ని, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాల‌ని తెలిపారు. కలెక్టర్‌ వెంబడి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో పోచారం భాస్కర్‌ రెడ్డి సూచనల‌ మేరకు పిబిఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీల‌ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ ఇతర గ్రామాల‌ నుండి రోజు వారీ పనుల‌ కోసం మండలానికి వచ్చే పేద ప్రజల‌కు పిబిఆర్‌ ...

Read More »

పూడికతీత పనుల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 8 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని ఖిల్లా రోడ్‌లో గల‌ డీ 54 కెనాల్‌ లోని పూడిక తీత పనుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల‌ను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ...

Read More »

33 గొర్రెలు మృతి

జగిత్యాల‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దపల్లి, జగిత్యాల‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడిరది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల‌ భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల‌ ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో ...

Read More »

ఆయా డివిజన్‌ల‌లో పారిశుద్య పనులు పరిశీలించిన మేయర్‌

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిదిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ సోమవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనుల‌ను నగరంలోని జోన్‌1 డివిజన్‌ 16లో పరిశీలించి చెత్త నిర్మూల‌నకు ప్రజల‌ సహకారం అందించాల‌ని కోరారు నగరంలోని జోన్‌2 డివిజన్‌ 4, 5 పరిధిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మురికి కాలువ నిర్వహణ, ...

Read More »