Breaking News

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది వల‌స కూలీల‌ను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి 9 బస్సుల‌లో కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, సి పి కార్తికేయతో కలిసి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

ఒరిస్సాకు చెందిన వల‌స కార్మికులు నిజామాబాద్‌ జిల్లా మండలం మోపాల్‌, మాక్లూర్‌ మండలాల‌లో ఇటుక బట్టీల‌లో పని చేసేవారని, వర్షాకాలం రావడంతో పని ముగిసిందని, వాళ్లు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవాల‌ని సూచించారు.

నిజామాబాద్‌ నుండి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌కు ఆర్టీసీ బస్సులో చేరుకొని శ్రామిక్‌ ప్రత్యేక రైలు ద్వారా వారి స్వస్థలాల‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్‌డిఓ వెంకటయ్య, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌ రావు తదితరులు ఉన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article