Breaking News

నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్ అమలుకు జిల్లా స్థాయి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సూచనల‌కు అనుగుణంగా జిల్లాలోని మున్సిపాలిటీల‌లో పనితీరును జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్షించారు. జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లో 85 శాతం నుండి 90 శాతం ఇండ్లనుండి చెత్తను సేకరిస్తున్నారని, దాదాపు 70 శాతం చెత్తను సేకరణ కేంద్రాల్లో తడి, పొడి చెత్తగా విడతీస్తున్నారని అధికారులు తెలియచేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భీంగల్‌లో సేకరణ శాతం చాలా తక్కువగా ఉన్నదని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో 100 శాతం చెత్త సేకరించి విడదీసి డంపింగ్‌ యార్డుల‌కు తరలించాల‌ని ఆదేశించారు. మున్సిపాలిటీలో కాల‌నీల్లో రోడ్ల పక్కన చెత్త పెరుకుపోకుండా చూడాల‌ని, సేకరించిన చెత్త‌ను డంపింగ్‌ యార్డులోనే వేయాల‌ని, నివాసాలు, చెరువులు, కాలువల వద్ద వేయకుండా చర్యలు తీసుకోవాల‌ని, చెత్త తరలించే వాహనాల‌ను కవర్‌తో మూయాల‌ని, చెత్త బుట్టలు పంపిణీ చేయాల‌ని, డంపింగ్‌ యార్డు చుట్టూ జంతువులు, ఇతరులు ప్రవేశించకుండా ఫెన్సింగ్‌ చేయాల‌న్నారు.

డంపింగ్‌ యార్డులో పచ్చదనం అభివృద్ధి చేయాల‌ని, ప్లాస్టిక్‌ కవర్‌ వాడకం లేకుండా చూడాల‌ని, నియమాలు ఉల్లంఘించిన వారికి వెంటనే జరిమానా విధించాల‌న్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌లు, జిల్లా పరిషత్‌ సిఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article