Breaking News

పరిశుభ్రత సామాజిక కార్యక్రమంగా భావించాలి

కామారెడ్డి, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మురికి కాలువల‌లో పూడిక ఎప్పటికప్పుడు తీయాల‌ని, రోడ్లపై చెత్త, పిచ్చిమొక్కలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని 15, 16 ,17వ వార్డులో మురుగు కాలువల‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పరిసరాల‌ పరిశుభ్రతను సామాజిక కార్యక్రమంగా పట్టణ ప్రజలు భావించాల‌ని కోరారు.

రోడ్లపై పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం లేకుండా చూడాల‌ని, మురుగు కాలువల్లో పూడిక ఎప్పటికప్పుడు తీయాల‌ని మునిసిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డుకు ఇద్దరు సిబ్బందిని నియమించామని, వారి పరిధిలోని మురుగు కాలువ‌లు, ప్రభుత్వ స్థలాల‌ను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాల‌ని సూచించారు. విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిని విధుల‌ నుంచి తొల‌గించాల‌ని కమిషనర్‌ దేవేందర్‌ను ఆదేశించారు.

వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, మురుగు కాలువలో నీరు నిలువ‌ ఉండకుండా చూడాల‌ని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, కమిషనర్‌ దేవేందర్‌, కౌన్సిల‌ర్లు నరేందర్‌, వనిత, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article