Breaking News

పూడికతీత పనుల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 1 నుండి 8 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని ఖిల్లా రోడ్‌లో గల‌ డీ 54 కెనాల్‌ లోని పూడిక తీత పనుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల‌ను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పటేల్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article