Breaking News

సిడి ఆవిష్కరించిన వల‌స కార్మికులు

కామారెడ్డి, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వల‌స కార్మికుల‌ కష్టాల‌ను తెలుపుతూ తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ రచించి రూపొందించిన ‘వల‌స కార్మికుల‌ గోస’ పాట ఆడియో సిడిని కామారెడ్డి జాతీయ రహదారిపై వల‌స కార్మికుల చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ పాటల‌ సిడిలో వల‌స కార్మికుల‌ కష్టాల‌ను పాటల‌ రూపంలో చెప్పడం జరిగిందన్నారు.

వల‌సలు వెళుతున్న కార్మికులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారని, సమాజం, ప్రభుత్వం వారిని ఆదుకోవాల‌న్నారు. కార్యక్రమంలో తెరవే ప్రధాన కార్యదర్శి అల్లి మోహన్‌ రాజ్‌, ఉపాధ్యక్షుడు నాగభూషణం, సభ్యులు జనార్ధన్‌ గౌడ్‌, రమేశ్‌, బాల‌కృష్ణ, నర్సింలు తదితరులున్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article