Breaking News

రేపటి కార్యక్రమంలో భౌతిక దూరం పాటించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న జరుపుకోబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల‌ సందర్భంగా నగరంలోని వినాయకనగర్‌లో అమరవీరుల‌ స్థూపాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయతో కలిసి పరిశీలించారు.

స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు పూర్తి కావాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. నివాళులు అర్పించే క్రమంలో భౌతిక దూరం పాటించాల‌ని, మాస్కులు ధరించాల‌ని, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాల‌ని తెలిపారు. కలెక్టర్‌ వెంబడి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ బి పాటిల్‌, డీఈ రషీద్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article