Breaking News

అంబలి కేంద్రం ప్రారంభం

బీర్కూర్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో పోచారం భాస్కర్‌ రెడ్డి సూచనల‌ మేరకు పిబిఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు.

గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీల‌ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ ఇతర గ్రామాల‌ నుండి రోజు వారీ పనుల‌ కోసం మండలానికి వచ్చే పేద ప్రజల‌కు పిబిఆర్‌ యువసేన ద్వారా ఉచిత అంబలి అందించడం వ‌ల్ల‌ వడదెబ్బ నుండి వారికి కాస్త ఉపశనం కలుగుతుందని భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల‌ ఎంపీపీ రఘు, ప్యాక్స్‌ చైర్మన్‌ కొలి గాంధీ, ఎంపీటీసీ సందీప్‌, మండల‌ పార్టీ అధ్యక్షుడు వీరేశం, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, మండల‌ యూత్‌ ప్రెసిడెంట్‌ శశికాంత్‌, నాయకులు అంజగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరవీరుల‌కు కాంగ్రెస్‌ సలాం

బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పూర్వ అధ్యక్షులు రాహుల్‌ ...

Comment on the article