Breaking News

కామారెడ్డిలో కరోనా…

కామారెడ్డి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకరికి కరోనా ల‌క్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్‌ నుండి హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌ తరలించారు. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల‌ ప్రకారం ఒమేగా అనే మహిళ ముంబై నుండి గత 13 రోజుల‌ క్రితం రామారెడ్డి మండలంలోని పోసాని పేట్‌ గ్రామంలో తన సొంత మేనమామ ఇంటికి వచ్చింది.

ముందు జాగ్రత్తలు తీసుకొని వారం రోజుల‌ పాటు హోం క్వారెంటేన్‌లో ఉంచి పర్యవేక్షించామని అన్నారు. ఆమె పూర్తి పేరు గొడుగు ఒమేగా (28) తండ్రి ఏలియా ఇమేకు తల్లి చనిపోయి ఉన్నందున మేనమామ ఇంటికి వచ్చినట్లు సమాచారం.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article