Breaking News

వెయ్యి మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 320 డి ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదు నగరంలోని పూలాంగ్‌, బస్‌ స్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రెస్‌ క్లబ్‌ ప్రాంతాల్లో వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఇరుకుల‌ వీరేశం మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తెలంగాణ వ్యాప్తంగా ల‌క్ష మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాదులో మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళసై మాస్కుల‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించారని చెప్పారు.

వీటితో పాటు ల‌యన్స్‌ అంతర్జాతీయ నిధి ఏడున్నర ల‌క్షల‌ రూపాయలు వచ్చిందని దీన్ని కోవిడ్‌ నియంత్రణ చర్యల‌ కోసం, పేదల‌ కోసం ఖర్చు చేస్తామన్నారు. కరోనా ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల‌ పాలైన వేలాది మంది పేదల‌కు రాష్ట్రంలోని ల‌యన్స్‌ క్లబ్‌ ద్వారా ఇప్పటికే నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు దరించాల‌ని అన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వ సూచనలు పాటించాల‌ని, బౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. కార్యక్రమంలో ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ కార్యదర్శి డి.యాదగిరి, కోశాధికారి అందె శివాజి, రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, జోన్‌ చైర్మెన్‌ ద్వారకాదాస్‌ అగర్వాల్‌, ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఫోర్ట్‌ సిటి అధ్యక్షుడు శెనిశెట్టి కిషన్‌, ఇందూర్‌ క్లబ్‌ కార్యదర్శి చింతల‌ గంగాదాస్‌, ల‌యన్స్‌ ప్రతినిధులు నాగేశ్వరరావు, రవింద్రనాథ్‌ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article