Breaking News

బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రజలందరికీ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆరవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో జెండా ఎగురవేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాల్సిన అవసరముందన్నారు.

రానున్న రోజుల్లో మన పిల్ల‌ల‌ భవిష్యత్తు బాగా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా లాంగ్‌ వేలో ముందుకు సాగుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల‌ను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరం బంగారు తెలంగాణ నిర్మించే దిశగా ముందుకు సాగుదామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆఫీసర్స్‌ క్లబ్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మధుసూదన్‌, జనరల్‌ సెక్రెటరీ నరసింహారెడ్డి, మాజీ సెక్రెటరీ సత్యనారాయణ, కిరణ్‌ కుమార్‌ గౌడ్‌, రామ్‌ రెడ్డి, ఈసీ మెంబర్‌ అంగిరేకుల‌ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article