Breaking News

తెలంగాణ ప్రజల‌కు కొత్తగా ఒరిగిందేమీ లేదు

కామారెడ్డి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల‌ పునాదుల‌పై ఏర్పడ్డ తెలంగాణ క‌ల్వ‌కుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియమాకాలు ప్రతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కామారెడ్డి నియోజక వర్గానికి అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని అన్నారు. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన తరువాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు వళ్ళ కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్క సెంటు భూమికి కూడా అదనంగా నీరంద లేదని, నిధుల‌ విషయంలో కూడా కామారెడ్డి తీవ్రంగా నష్ట పోయిందన్నారు. జిల్లా కేంద్రం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని రమణారెడ్డి అన్నారు.

ఇక నియమాకాల‌ విషయంలో ఎంతో మంది చదువుకున్న యువత ఆశల‌న్నీ ఆవిరి అయ్యాయని, ఉపాధి లేక యువత అడ్డా కూలీలుగా, వల‌స కూలీలుగా, ఉపాధి హామీ కూలీలుగా మారారని వాపోయారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article