Breaking News

టియులో అవతరణ దినోత్సవ వేడుక

డిచ్‌పల్లి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో 7 వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పరిపాల‌నా భవనం ఎదుట రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం జెండా ఆవిష్కరణ చేశారు. కరోనా నేపథ్యంలో ఉగ్యోగ సిబ్బందితో ముందుగా క్యాంపస్‌ పరిసర ప్రదేశాల‌ను శానిటైజర్‌తో స్ప్రే చేసి, శుభ్రం చేయాల‌ని జెండా ఆవిష్కరణ సందర్భంలో భౌతిక దూరం పాటించే విధంగా తెల్ల‌ని సున్నంతో రింగులు వేయాల‌ని ఆదేశించారు.

పరిపాల‌నా భవనానికి విచ్చేసిన రిజిస్ట్రార్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. మొదటగా జ్యోతి ప్రజ్జ్వల‌న చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష కృషి సలిపి అమరులైన తెలంగాణ జాతి పిత ఆచార్య జయశంకర్‌ సార్‌ చిత్ర పటానికి పూల‌మాల‌ వేసి నమస్కరించారు. అనంతరం మువ్వన్నెల‌ జెండా ఎగురవేసి, సామూహిక జాతీయగీతం పాడారు. తెలంగాణ విశ్వవిద్యాల‌య అధ్యాపక, అధ్యాపకేతర, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పరిశోధకుల‌కు, విద్యార్థుల‌కు రిజిస్ట్రార్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్న కారణంగా ఉపన్యాసాలు, ఇతర కార్యక్రమాలు ఏమి లేకుండా అందరు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలు ముగిశాయి. ఉపకుల‌పతి నీతు కుమారి ప్రసాద్‌ ఐఏఎస్‌ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article