Breaking News

కెసిఆర్ పాల‌నలో అమరుల‌ ఆత్మలు ఘోషిస్తున్నాయి

కామారెడ్డి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్ పాల‌నలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన నిరుద్యోగుల‌ విద్యార్థి అమరుల‌ ఆత్మలు ఘోషిస్తున్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, విద్యార్థి జన సమితి జిల్లా నాయకులు ల‌క్ష్మణ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల‌ స్మారక స్థూపం వద్ద నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల‌కు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అని పేర్కొన్నారు. కెసిఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌నలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫల‌మైందని ఇప్పటికైనా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అమరులు ఆకాంక్షించిన ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల‌ చేయాల‌ని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

2010 లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు దగ్ధం చేసి తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి తప్ప ఉద్యోగాలు వద్దని ఆనాడు పోరాటం చేస్తే ఈ రోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల‌ను నియామకాలు చేయకుండా నిరుద్యోగుల‌ జీవితాల‌తో చెల‌గాటమాడుతున్నారన్నారు. గడిచిన ఆరు నెల‌ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యలు చదివి ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని బాధతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్ప‌డడం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్‌ ఒంటెద్దు పోకడలు మానుకొని పెద్దఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాల‌ని లేకపోతే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏరకమైన ఉద్యమాల‌ను చేపట్టడం జరిగిందో మరొమారు అదే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ, నియోజకవర్గ ఇంచార్జ్‌ శ్రీకాంత్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article