Breaking News

గతంలో గోసపడ్డ సమస్యల‌న్ని తీరాయి

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ పట్టణంలోని తెలంగాణా అమరవీరుల‌ స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రదాంజలి ఘటించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో కలిసి వినాయక్‌ నగర్ తెలంగాణ అమరవీరుల‌ స్థూపానికి నివాళుల‌ర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల‌ త్యాగాలు, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్‌ పోరాటా ఫలితంగా జూన్‌ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని, గత 50 సంవత్సరాలుగా తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల‌ స్వరాష్ట్ర పాల‌న కోరిక తీరిందని, గత ఆరు సంవత్సరాల‌లో ఏ తెలంగాణ కోసం పోరాటం చేశామో, ఆ తెలంగాణలో ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి జనరంజక పాల‌న అందించారని, గతంలో గోసపడ్డ సమస్యల‌న్నీ తీరాయని, పేదలు, రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి అన్నారు.

పేదల‌కు 2016 రూపాయల‌ ఆసరా పెన్షన్‌, రైతుల‌కు 24 గంటల‌ నాణ్యమైన ఉచిత విద్యుత్‌, రైతు బంధు పథకం క్రింద పంటకు 5 వేల‌ చొప్పున సంవత్సరానికి రెండు పంటల‌కు కలిపి 10 వేల‌ రూపాయల‌ పంట పెట్టుబడి, కుంట పొల‌మున్న రైతు అయినా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూసేందుకు వారం రోజుల్లోనే అందేట్లు ఐదు ల‌క్షల‌ ఇన్సూరెన్స్‌ ఇంటివద్ద అందేట్లు పథకాలు రూపొందించి రైతుల ఇబ్బందులు దూరం చేశారని పేర్కొన్నారు.

ఈ పథకాన్నీ దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నాయని మంత్రి వివరించారు. కేవలం మూడు సంవత్సరాల‌లో దేశంలోనే అతిపెద్ద మల్టి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదని అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్‌ 1, ఆరు సంవత్సరాల‌లో దేశంలో నెంబర్‌ 1 సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాల‌నవల్లే సాధ్యమైనదని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ, ఎమ్మెల్యే బీగాల‌ గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీలు వి జి గౌడ్‌, రాజేశ్వర్‌, ఆకుల ల‌లిత, జెడ్‌ పి చైర్మన్‌ విట్టల్‌ రావు, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, వివిధ శాఖల‌ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ ...

Comment on the article