Breaking News

ఆవిర్భావ కానుకగా రూ. 25 కోట్లు ఇవ్వండి

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జర్నలిస్ట్‌ కుటుంబాల‌ను కరోన కష్టకాలంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.25 కోట్లు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా ఇవ్వాల‌ని టీయూడబ్ల్యూజే నిజామాబాద్‌ జిల్లా నాయకత్వం కోరింది. మంగళవారం రాత్రి నిజామాబాద్‌ గాంధీ చౌక్‌ అమరవీరుల‌ స్థూపానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమాల్‌పూర్‌ గణేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన వెలుగులో ఆరేళ్ళు సొంత పాల‌న ఉండడం వల్లే తెలంగాణ జర్నలిస్ట్‌ సమాజానికి అభివృద్ధి, సంక్షేమం అందుతున్నాయని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం సానుకుల‌తవల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా 100 కోట్లు జర్నలిస్టు సంక్షేమం కోసం ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో జర్నలిస్ట్‌ సమాజాన్ని కవాతు చేయించిన అల్లం నారాయణ నాయకత్వంలో మీడియా అకాడమీ ద్వారా ముందు ఎన్నడూ లేని విధమైన పథకాల‌తో జర్నలిస్టుల‌కు మేలు చేస్తున్నారని ప్రశంసించారు.

కుటుంబాల‌కు ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌ స్కీం అమలు చేస్త్తున్న ప్రభుత్వం మనదే అన్నారు. అదే లెక్కన కరోన సాయం ప్రకటించాల‌ని కోరారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు రాజేష్‌, కోశాధికారి సతీష్‌ గౌడ్‌, తెంజు నేతలు దనుంజయ్‌, సాయి ప్రసాద్‌, బాలు, రజనీకాంత్‌, పిటి శ్రీనివాస్‌ రెడ్డి, సాహసం చారి, నర్సింహ చారి, హరికృష్ణ, కట్ట సతీష్‌, కిరణ్‌, నుక రవి, అజ్మత్‌, ఫోటో జర్నలిస్ట్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ, విద్యావంతుల‌ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆశ నారాయణ, డాక్టర్ జ‌మాల్‌పూర్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article