Breaking News

పరిసరాల‌ పరిశుభ్రత పాటించాలి

కామారెడ్డి, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల‌ పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గాంధారి మండలం సర్వాపూర్‌ గ్రామంలో బుధవారం పారిశుద్ధ్య పనుల‌ను పరిశీలించారు. మురుగు కాలులు శుభ్రంగా మార్చాల‌ని, రోడ్లపై వర్షపు నీరు నిలువకుండా చూడాల‌న్నారు.

ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వినియోగించుకోవాల‌ని, బహిరంగ మల‌విసర్జన వల‌న కలిగే అనర్థాల‌ను వివరించారు. బహిరంగ ప్రదేశాల‌లో మల‌ విసర్జన చేసిన వారికి రూ. 500 జరిమానా విధించాల‌ని గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, డీఎల్పీవో రాజేంద్ర కుమార్‌, ఎంపీడీవో రవిశ్వర్‌, తహసీల్దార్‌ సంగమేశ్వర్‌, ఏపీవో నరేందర్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article