Breaking News

పరిశోధక విద్యార్థికి ‘కనెక్ట్ చాన్స్ ల‌ర్‌ పురస్కారం

డిచ్‌పల్లి, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని ఉర్దూ విభాగానికి చెందిన పిహెచ్‌. డి. విద్యార్థి మహ్మద్‌ ముస్తఫా అర్ఫత్‌ ‘కనెక్ట్‌ చాన్సల‌ర్‌’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల‌ మీదుగా ఉర్దూ భాషకు గాను ‘కోవిద్‌ – 19 మూలం, పరివ్యాప్తి, నిర్దారణ పరీక్షలు, చికిత్సా విధానం’ అనే అంశంపై రచించిన వ్యాస రచన పోటీలో తృతీయ బహుమతిని అందుకున్నారు.

హైదారాబాద్‌ రాజ్‌భవన్‌లో జూన్‌ 2 వ తేదీన జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో గవర్నర్‌ ధ్రువ పత్రం, 5 వేల‌ నగదు పురస్కారాన్ని అందించి మహ్మద్‌ ముస్తఫా అర్ఫత్‌ను ప్రశంసించారు.

ఇటీవల‌ కరోనా మహమ్మారి కల‌కలం రేపుతున్న సందర్భంగా గవర్నర్‌ ‘కనెక్ట్‌ చాన్సల‌ర్‌’ అనే ఆన్‌ లైన్‌ వేదిక ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ విశ్వవిద్యాల‌య రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మహ్మద్‌ ముస్తఫా అర్ఫత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ విశ్వవిద్యాయం నుంచి విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో అధిక సంఖ్యలో రచనలు పంపగా, అందులో మహ్మద్‌ ముస్తఫా అర్ఫత్‌ వ్యాస రచనకు గాను ఉర్దూ భాషలో తృతీయ బహుమతి సాధించి, గవర్నర్‌ చేతుల‌ మీదుగా పురస్కారాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. పురస్కారం పొందిన విద్యార్థిని అధ్యాపకులు, తదితరులు ప్రశంసించారు.

Check Also

డిచ్‌పల్లిలో యాచకుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాకుడౌన్‌ విధించిన సందర్భంలో సరైన ...

Comment on the article