Breaking News

తెలంగాణలో తొలి యాపిల్‌ పండు పండిరచింది ఇతనే…

హైదరాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో తొలిసారి ఆపిల్‌ పండ్లు పండిరచిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజి తొలి కాతను ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్‌ఆర్‌ 99 ఆపిల్‌ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు.

ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఆపిల్‌ పంట సాగుపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేల విభిన్న రకాల‌ స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేల‌ల్లో ఆపిల్‌ పండ్లు పండడమే ఉదాహరణ అన్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న వారికి ముఖ్యమంత్రి ఆపిల్‌ పండ్ల రుచి చూపించారు.

Check Also

నేటి నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నిర్మూల‌న కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో ...

Comment on the article