బాన్సువాడ, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు 500 మంది కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బాన్సువాడ పట్టణంలోని తెరాస పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ప్రశాంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు. తెరాస పార్టీలో చేరిన వారిలో వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తగిలేపల్లి ఎంపిటిసి బక్క నారాయణ, ముదిరాజ్ సంఘం మండలం అధ్యక్షుడు, జాకోరా గ్రామ ఎంపిటిసి ఎండుగుల సాయిలు, జాకోరా మాజీ సర్పంచ్ పిఏసిఎస్ జాకోరా డైరెక్టర్ బంజే గంగారాం, 500 మంది కార్యకర్తలు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి - January 21, 2021
- పెండింగ్ ముటేషన్లు త్వరగా పూర్తిచేయాలి - January 21, 2021
- ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం - January 21, 2021