Breaking News

Daily Archives: June 8, 2020

ఐదుగురికి కరోనా….

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 37వ వార్డు అశోక్‌ నగర్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. వీరంతా ఐదు రోజుల‌ క్రితం వర్లీ ముంబై నుండి వచ్చారని, 8 మంది నమూనాల‌ను పంపగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కోవిడ్‌ 19 నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Read More »

15 రోజుల వరకు అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దు…

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం అధికారులు చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. మేకల‌ మందపై ఆదివారం రెండు చిరుతలు దాడి చేసి రెండు మేకల‌ను కొరికి చంపడంతో పాటు మరో మూడు మేకల‌ను తీవ్రంగా గాయ పరిచాయి. మాచారెడ్డి రేంజ్‌ అధికారి కిరణ్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారిని సుజాత తమ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. గొర్రెల‌, మేకల‌ కాపర్ల నుంచి వివరాలు అడిగి ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని పు గ్రామాల్లో కళ్యాణల‌క్ష్మి, షాధి ముబారక్‌ చెక్కుల‌ను ఇంటిటికి తిరుగుతూ ల‌బ్దిదారుల‌కు ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్‌, హజీపూర్‌, ల‌క్ష్మాపూర్‌, మాచాపూర్‌, గ్రామాల‌తో పాటు ఎల్లారెడ్డిలో సుమారు 21,77, 436 రూపాయల విలువ‌గల‌ కళ్యాణ ల‌క్ష్మీ, షాధిముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు.

Read More »

‘పది’ దాటింది…

హైదరాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థుల‌ను పై తరగతుల‌కు ప్రమోట్‌ చేయాల‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ తరగతి పరీక్షల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ...

Read More »

అట్లర్టీ… బట్టర్లీ… బ్లాక్డ్‌

అమూల్‌ ఉత్పత్తుల‌కు సంబంధిచిన గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు చెందిన ఖాతాను ట్విట్టర్‌ బ్లాక్‌ చేసింది. ఎగ్జిట్‌ ద డ్రాగన్‌ పేరిట అమూల్‌ సంస్థకు చెందిన యాడ్‌ పోస్టు చేసిన అనంతరం అకౌంట్‌ బ్లాక్‌ అయినట్టు అమూల్‌ గుర్తించింది. అమూల్‌ అకౌట్‌ బ్లాక్‌ చేసిన ట్విట్టర్‌ తదుపరి పునరుద్ధరణ ఎగ్జిట్‌ ద డ్రాగన్‌ కార్టున్‌ పోస్ట్‌ చేసిన అనంతరం… కార్టూన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కొత్త విధానానికి మద్దతుగా నిలిచింది. తూర్పు ల‌డఖ్‌లోని ఇరు దేశాల‌ ...

Read More »

మనోజ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌తో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్‌ కుటుంబానికి తన వంతు సహాయంగా రూ. 50,000 (యాబై వేల‌ రూపాయలు) ఆర్ధిక సహాయం ప్రకటించినట్టు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజల‌కు వార్తల‌ను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్‌ అకాల‌ మరణం తనను అత్యంత బాధకు గురిచేసిందని భాస్కర్‌ రెడ్డి తెలిపారు. వారి ...

Read More »

రైతు సోదరుల‌కు తెలియజేయునది…

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సోదరుల‌కు తెలియజేయునది… 2019 సంవత్సరం జూన్‌ 10వ తేదీ తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులు వానాకాలం 2020 రైతు బంధు పథకానికి గాను దరఖాస్తు చేసుకోవాల‌ని అదికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతుబందు దరఖాస్తు ఫారం, పట్టా దారు పాసుపుస్తకం జిరాక్స్‌, పట్టాదారుని ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పట్టాదారుని బ్యాంకు ఖాతా జిరాక్స్‌ సమర్పించవల‌సి ఉంటుందన్నారు.

Read More »

స్వచ్ఛ గాంధారి

గాంధారి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం గాంధారి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ గాంధారిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త బుట్టలు ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ చేతుల‌ మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత కొరకు చెత్తబుట్టలు సద్వినియోగం చేసుకొని పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు. కార్యక్రమంలో గాంధారి మండల‌ నాయకులు పాల్గొన్నారు.

Read More »