Breaking News

Daily Archives: June 9, 2020

ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు ధరణి వెబ్‌సైట్‌లో నమోదు, ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌పై జిల్లా అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో జిల్లా అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విజిలెన్స్‌ అధికారులుగా నియమించబడిన జిల్లా అధికారులు శుక్రవారం గ్రామపంచాయతీలో రెండు గ్రామాల‌కు మున్సిపాలిటీలో ఒక వార్డుకు వెళ్లాల‌ని ఆదేశించారు. గ్రామాల‌లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారంలో ప్లాంటేషన్‌కు గుర్తించిన స్థలాల‌ను పరిశీలించాల‌ని, ప్రభుత్వ ఆస్తులు ...

Read More »

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్ కాల‌నీలో భర్త ఇంటి ఎదుట భార్య అందోళన చేసింది. మంగళవారం ఉదయం నుంచి బైఠాయించగా ఇంకా కొనసాగుతుంది. మామ సురేందర్‌ తాను చెప్పినట్లు వినాల‌ని కోడలుపై వేధింపులు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా కొడుకు నవీన్‌కు రెండో వివాహం చేస్తామని, ఎమైనా చేసుకొండి అంటూ కోడలిపై మామ సురేందర్‌ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. కోడలుకు గర్భ సంచి లేదని భర్త నవీన్‌, మామ సురెందర్‌, అత్త సునీతలు, వివాహం ...

Read More »

వసతులు అవసరమైతే సమకూరుస్తాం…

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ హానరబుల్‌ మెంబర్‌ రాగజ్యోతి నిజామాబాద్‌ జిల్లాలో బాలల‌ హక్కుల‌ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల‌పై సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో బాలల‌ పరిరక్షణ, బాల‌ కార్మికులు, చిన్నపిల్ల‌ల‌పై లైంగిక వేధింపులు, అంగన్‌వాడి సేవ‌లు, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ ఫ్రీ నంబర్‌ 1098, రైల్వే చైల్డ్‌ లైన్‌ తదితర అంశాల‌పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్ల‌ల‌ సంక్షేమానికి నిర్వహిస్తున్న పథకాలు ...

Read More »

ఫోటో మార్చి డబ్బా కొట్టుకుంటున్నారు…

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటల‌కు రాజారెడ్డి కల్యాణమండపంలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి ప్రధాన మంత్రి అయి ఏడాది పూర్తయిన సందర్బంగా కేంద్రప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు వాటి విధి విధానాల‌ గూర్చి ప్రజల‌కు తెలియ చేయడానికి ప్రతి ఇంటికివెళ్ళి చెప్పడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూచించారు. మాటలు ...

Read More »

రోజుకు సుమారు 300 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు….

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రభుత్వం మంజూరుచేసిన కోవిడ్‌ 19 పరీక్ష కేంద్రం (వైరాజీ ల్యాబ్‌) ఏర్పాట్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో కోవిడ్‌ 19 పరీక్షలు స్థానికంగా నిర్వహించదానికి వీలుగా ప్రభుత్వం పంపిన వైరాల‌జీ ల్యాబ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ 19 పరీక్షల కొరకు ప్రభుత్వం పంపిన ఎక్విప్‌మెంట్‌ వచ్చిందని, లాబ్‌ ఏర్పాటు ...

Read More »

30 లోపు వాటిని పూర్తిచేయకుంటే సస్పెన్షన్‌

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల‌లో స్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్లు జూన్‌ 30 లోపు పూర్తి చేసి ప్రారంభించాల‌ని, పూర్తి చేయని గ్రామాల‌ సర్పంచులు, అధికారుల‌ను సస్పెండ్‌ చేస్తానని, ఎట్టి పరిస్థితుల‌లో ఉపేక్షించేది లేదని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆర్డీవోలు, ఎంపిడివోలు, మండల‌ స్పెషల్‌ ఆఫీసర్లతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల‌ అభివృద్ధి, పరిశుభ్రతకై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు ...

Read More »

కరోనా వారియర్స్‌గా జర్నలిస్టుల‌ను గుర్తించి ఆదుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారికి గురై మరణించిన జర్నలిస్టుల‌కు 25 ల‌క్షల‌ ఆర్థిక సహాయం అట్లాగే జర్నలిస్టుందరికీ 10 ల‌క్షల‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయించాల‌ని, జర్నలిస్టు కుటుంబాల‌కు 6 నెలల‌ వరకు ప్రతీ నెల‌ 10 వేలు ఇవ్వాల‌ని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్‌డివో కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు దేవారాం, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు ఏరియా అధ్యక్షుడు అనిల్‌ ...

Read More »