Breaking News

Daily Archives: June 10, 2020

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల‌ సురేందర్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్లకు సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల‌ సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యనారాయణ అధ్యక్షత జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అందరు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఆమోదంతో 2020-21 అంచనా బడ్జెట్‌ 8 ...

Read More »

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం 3 గంటల‌ సమయంలో సంతాయిపేట్‌ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య, చిట్యాల‌ గ్రామానికి చెందిన జంగం భూలక్ష్మి కామారెడ్డి డెంటల్‌ హాస్పిటల్‌ నుండి తిరిగి తమ ఎక్స్‌ఎల్‌ బండిమీద చిట్యాల‌ గ్రామానికి బయల్దేరారు. తాడ్వాయి గ్రామం దాటినా తరువాత హనుమాన్‌ గుడివద్ద వెనకనుండి బ్లూ కల‌ర్‌ ఎఫ్‌జెడ్‌ బైక్‌ మీద వచ్చిన వారు లక్ష్మి మెడనుండి పుస్తెల‌ తాడు తెంపుకొని పారిపోయారు. బైక్‌ మీద వచ్చిన వారు ఒకరు మెరూన్ ...

Read More »

వివాహిత ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవుని పల్లి గ్రామానికి చెందిన పుల్ల‌న్నగారి నవ్య (29) వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకుని చనిపోయింది. కాగా మృతురాలి భర్త గత ఐదు సంవత్సరాల‌ క్రితం మరణించాడు. గత నెల‌ 16వ తేదీ ఆమె భర్త వర్ధంతి నుండి మానసికంగా కుంగిపోతూ, తల్లిదండ్రుల‌కు భారమయ్యానని ఉరి వేసుకుని చనిపోయింది. వివాహితకు తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడు సంవత్సరాల‌ బాబు ఉన్నారు. తండ్రి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు ...

Read More »

మిడతల‌ దండు కల‌కలం…

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం వజ్జపల్లి గ్రామ శివారులో మిడతల‌ సంచారం జరుగుతున్నట్టు గుర్తించారు. చెట్ల ఆకుల‌ను తినడంతో గ్రామస్తులు మిడతల‌ దండు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వజ్జపల్లి గ్రామాన్ని వ్యవసాయాధికారి సందర్శించారు. గ్రామస్థుల‌కు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు.

Read More »

నాటిన మొక్కలు సంరక్షించాలి

నిజాంసాగర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ దపెదర్ బాల‌మణి రోడ్డుకు ఇరుప్రక్కల‌ మొక్కలు నాటి వాటికి కంచె ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ చేయాల‌ని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నారాయణరెడ్డి, వార్డ్‌ సభ్యులు, నాయకులు ధాఫెదర్‌ విజయ్‌ కుమార్‌, కాశయ్య, మోతె రామ గౌడ్‌, కారోబార్‌ అంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

వారి సేవ‌లు అనితర సాధ్యం…

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌పై పోరాటంలో పారిశుద్య సిబ్బంది సేవ‌లు అనితర సాధ్యమని, వారి ఆరోగ్యం కాపాడవల‌సిన బాధ్యత మనదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాల‌యంలో ఫ్లాష్‌ ప్రయివేటు లిమిటెడ్‌ వారి సౌజన్యంతో మున్సిపాలిటీ సిబ్బందికి గ్లౌసులు, షూస్‌, ఏపాన్‌తో కూడిన పిపిఇ కిట్లు బహుకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్య సిబ్బందికి అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ ...

Read More »

గృహ క్వారంటైన్‌ను సందర్శించిన డిఎం అండ్‌ హెచ్‌వో

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామంలో మైగ్రేట్‌ కోవిడ్‌ కేసు ప్రైమరీ కాంటాక్టుల‌ను గృహ క్వారంటైన్‌లో ఉంచబడిన వారి ఇళ్లను కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ సందర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడు గృహాల‌ను సందర్శించగా వారికి ఇంత వరకు ఎలాంటి దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులు లేవని, వారికి అవసరమైన సరుకులు వారి ఆవశ్యకత ప్రకారం అందజేయాల‌న్నారు. స్థానిక వైద్యుల‌కు, ...

Read More »

పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం రెండు పడక గదుల‌ ఇళ్ళు

హైదరాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్రూం ఇల్లు పేదింటి ఆడబిడ్డల‌ ఆత్మగౌరవ ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంత్రి బుధవారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బి కార్యాల‌యంలో గృహ నిర్మాణ మరియు ఆర్‌అండ్‌బి పనుల‌ పురోగతి పై వేరువేరుగా సంబంధిత శాఖ అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగిన ఆన్‌ గోయింగ్‌ పనుల్లో ...

Read More »

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి…

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అందరి భాగస్వామ్యంతో అన్ని రకాల‌ ప్రభుత్వ పథకాల‌తో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్‌ తెలిపారు. బుధవారం స్థానిక సత్య కన్వెన్షన్లో జరిగిన కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ నిట్టు జాహ్నవి అధ్యక్షత జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అందరు వార్డు మెంబర్ల చప్పట్ల మధ్య ...

Read More »

మనోజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఇటీవల‌ కరోనతో మృతిచెందిన మనోజ్‌ యాదవ్‌ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆర్‌డివో కార్యాల‌యం ఎదురుగా నినాదాలు చేసి ఆర్‌డివోకు వినతిపత్రం అందజేశారు. అలాగే మనోజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాల‌ని. డిమాండ్‌ చేశారు.

Read More »

స్థల‌ దాతకు సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని మార్ది గ్రామంలో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్‌కు శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం కమ్యూనిటీ హల్‌ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన వారిని సన్మానించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌కు సన్మానం

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డిపేట్‌ మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల‌యంలో ఎంపీపీ రాజు దాస్‌ సమక్షంలో మండల‌ నాయకులు ఇటీవల‌ కామారెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికైన ఉమ్మన్నగారి మనోహర్‌ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వజ్ర, వస్త్రం, గోపాల్‌ రెడ్డి, ప్రభాకర్‌, సిద్ధిరాములు, తదితరులు ఉన్నారు.

Read More »

అగ్రిక‌ల్చ‌ర్‌ గోదాముకు స్థల‌ పరిశీల‌న

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలో అగ్రిక‌ల్చ‌ర్‌ గోడౌన్స్‌ నిర్మించడానికి స్థల‌ సేకరణలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని గుండారం గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. బుధవారం ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్రిక‌ల్చ‌ర్‌ గోడౌన్‌ నిర్మాణానికి అనువుగా స్థలాల‌ను గుర్తించి ప్రతిపాదనలు పంపాల‌ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారం గ్రామ శివారులోని 9 ...

Read More »