Breaking News

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల‌ సురేందర్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్లకు సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల‌ సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యనారాయణ అధ్యక్షత జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అందరు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఆమోదంతో 2020-21 అంచనా బడ్జెట్‌ 8 కోట్ల 12 ల‌క్షలు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ అందరు కౌన్సిల్‌ మెంబర్ల సహకారంతో ప్రజల‌కు మౌళిక సదుపాయాల క‌ల్ప‌న‌తో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా దిద్దాల‌ని తెలిపారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన పనుల‌కు మొదటి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ పూర్తి చేయాల‌ని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 2020-21 బడ్జెట్లో 8 కోట్ల 12 ల‌క్షల‌ ఆదాయంతో ఆమోదం పొందిందని, ఇందులో గ్రీన్‌ బడ్జెట్‌ కింద హరితహారం కార్యక్రమాల‌ నిర్వహణకు 49 ల‌క్షల‌ 80 వేలు కేటాయించడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాల‌ని, పారిశుద్య కార్యక్రమాల‌ను సక్రమంగా నిర్వహించాల‌ని, పచ్చదనం పెంపొందించాల‌ని, దీనికోసం 4 కోట్ల 50 ల‌క్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు.

మున్సిపాలిటీ ఆదాయ మార్గాల‌ను పెంచుకోవాల‌ని, ఇండ్లు, పాట్లు వివరాల‌ను తనిఖీ చేసి అనుమతి పొందని వాటిని రెగ్యుల‌ర్‌ చేసుకోవాల‌ని, పన్నుల‌ వసూళ్లు సక్రమంగా నిర్వహించాల‌ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, వైస్‌ చైర్మన్‌ సుజాత, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి ఎంపిటిసి పార్వతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జహీరాబాద్‌ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి ...

Comment on the article