Breaking News

వివాహిత ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవుని పల్లి గ్రామానికి చెందిన పుల్ల‌న్నగారి నవ్య (29) వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకుని చనిపోయింది. కాగా మృతురాలి భర్త గత ఐదు సంవత్సరాల‌ క్రితం మరణించాడు.

గత నెల‌ 16వ తేదీ ఆమె భర్త వర్ధంతి నుండి మానసికంగా కుంగిపోతూ, తల్లిదండ్రుల‌కు భారమయ్యానని ఉరి వేసుకుని చనిపోయింది. వివాహితకు తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడు సంవత్సరాల‌ బాబు ఉన్నారు. తండ్రి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Check Also

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ ...

Comment on the article