Breaking News

అంతిమ యాత్రలో ఆమెకు తోడుగా

కామారెడ్డి, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నా అన్న వారు ఎవరు లేక అంతిమ యాత్రకు నోచుకోని సంఘటన గురువారం కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో చోటు చేసుకుంది. చివరికి కొందరు తామున్నామని అండగా నిలిచి మానవత్వం బ్రతికే ఉందని చాటుకున్నారు. అంతిమ యాత్రకు కూడా నోచుకోలేక ఎందరో చివరికి మున్సిపాలిటీ పాల‌వుతున్న సంఘటనలు ఎన్నో. కామరెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో నివాసముంటున్న బాలామణి (60) గురువారం మృతి చెందింది.

ఆమెకు కూతరు శ్రావణి తప్ప ఎవరు లేరు. బాలామణికి షుగర్‌ కారణంగా ఒక కాలు తొల‌గించారు. ఇంకో కాలు సైతం తొల‌గించాల‌ని చెప్పారు. ఈ పరిస్థితుల్లో శ్రావణి ఇళ్ళలో పని చేస్తూ ఇంటిని నెట్టుకొస్తుంది. ఇంతలో తల్లి మరణంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెల‌కొంది.

నలుగురు పాడె మోసేవారు, డబ్బు ఖర్చు చేసే వారు సైతం లేకపోవడంతో శ్రావణి అనాధగా మిగిలి ఏడుస్తూ కూర్చుంది. విషయం తెలుసుకున్న కొందరు మానవతా వాదులు బాంబే క్లాత్‌ హౌస్‌ యజమాని వి టి లాల్‌, తిరుమల‌ బటన్‌ స్టోర్‌ యజమాని చంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో వి టి లాల్‌ స్వంత ఖర్చుతో దహన సంస్కారం నిర్వహించారు. తిరుమల‌ బటన్‌ స్టోర్‌ యజమాని చంద్రం అంతిమ యాత్రకు వాహనాన్ని సమకూర్చారు. మానవత్వం బ్రతికే ఉందని నిరూపించారు. ప్రకాష్‌, కృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమం నిర్వహించారు.

Check Also

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ...

Comment on the article