Breaking News

Daily Archives: June 12, 2020

ప్రశ్నించే గొంతును అణిచివేయడం తగదు

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, కవులు, రచయితలు, మేధావుల‌ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసిన వారిని విడుదల‌ చేయాల‌ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును అణచివేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కుని చేయడమే అన్నారు. కవులు, రచయితలు, మేధావుల‌పై ప్రజాస్వామ్య వాదుల‌పై ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వాలు జీర్ణించుకోలేక వారిని అక్రమ అరెస్టు చేసి సంవత్సరాల‌ ...

Read More »

ఆరునెలల‌ గడువు ఇవ్వండి

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సంధర్భంగా ఉపాధి కోల్పోయిన సామాన్య, మధ్య తరగతి ప్రజల‌ నుండి ఇంటి పన్ను, వాటర్‌ పన్ను వసూలు చేయద్దని కామారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యం ముందు నిరసన అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినట్టు సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ పెట్టడం వ‌ల్ల‌ సామాన్య, మధ్య తరగతి చిన్న, చితక నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి ...

Read More »

వర్షాలు సమృద్ధిగా కురవాలి…

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర సమీపంలోని కాలూర్‌ గ్రామంలో మహాల‌క్మి దేవి అమ్మవారిని శుక్రవారం నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలు బయట పడాల‌ని మొక్కుకున్నారు. గ్రామంలోని ఆల‌యంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఈయేడు వర్షాలు సంవృద్దిగా కురవాల‌ని, పంటలు బాగా పండి రైతాంగం ఆనందంగా ఉండాల‌ని, ప్రజలందరు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని వేడుకున్నారు. మేయర్‌ వెంట స్థానిక కార్పొరేటర్ ల‌లిత గంగాధర్‌, ...

Read More »

గ్రామ పంచాయతీల‌కు విజిలెన్సు అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూన్‌ ఒకటి నుండి 8 వ తేదీ వరకు గ్రామాల‌లో నిర్వహించిన పనుల‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించటానికి జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఎడపల్లి మండలం నెహ్రూ నగర్‌ గ్రామం సందర్శించారు. గ్రామంలోని వీధుల‌న్నీ తిరిగి శానిటేషన్‌, ఇతర పనుల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 92 గ్రామ పంచాయతీల‌లో ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఏఏ పనులు చేపట్టారు, ...

Read More »

ప్రభుత్వ పనుల‌కు అడ్డుతగిలితే క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పనుల‌కు ఉపయోగించే నిమిత్తం అనుమతించబడిన ఇసుకను తరలించే క్రమంలో ఎవరైనా అడ్డుతగిలినా, అభ్యంతరాలు చెప్పినా క్రిమినల్‌ కేసులు పెట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వన్‌ టూ త్రి ఆర్డర్స్‌లో ఉన్న ఇసుక రీచ్‌లు ఎనిమిది మండలాల‌ పరిధిలో ఉన్నాయని, ఈ ఎనిమిది మండలాల‌ నుండి నిజామాబాద్‌ జిల్లాలోని 29 మండలాల‌కు ఇసుక వెళ్లాల‌ని, ఎట్టి పరిస్థితుల్లో ఆగరాదని, ఈ ...

Read More »

తెలంగాణ సార్వభౌముడు సినారె

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్యునిగా, కవిగా, పరిపాల‌నాధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యునిగా, పరిశోధకుడిగా, సినీ గేయరచయితగా చెరగని ముద్ర వేసిన తెలుగు భాషకు తెలంగాణ కవిసార్వభౌముడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల‌లో డాక్టర్‌ సి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల‌మాల‌ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల‌ సుధాకర్‌ మాట్లాడుతూ ...

Read More »

అందరికీ అండగా…

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశం మేరకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఆబియాన్‌లో భాగంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల‌ జీవితాల‌ను అతలాకుతలం చేసిన కరొనా లాక్‌ డౌన్ కాలంలో నష్టపోయిన యావత్‌ భారత ...

Read More »

‘నేనున్నానని’

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న డివిజన్‌ 49… కార్పొరేటర్‌ మెట్టు విజయ్‌… భారతీయ జనతా పార్టీ క్రియాశీల‌ కార్యకర్త… వినమ్రత, విధేయత, ఆత్మీయత కల‌బోసిన మనస్తత్వం… అహర్నిశలు డివిజన్‌ అభివృద్ధి, డివిజన్‌ ప్రజల‌ సమస్యల‌ పరిష్కారం కోసం పనిచేస్తున్న కార్పొరేటర్‌. 49వ డివిజన్‌లో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కార్పొరేటర్‌గా మెట్టు విజయ్‌ ప్రజల‌ మన్ననలు పొందుతున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్‌ ప్రజల‌కు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల‌ పరిష్కారం కోసం, ...

Read More »