Breaking News

స్పీకర్‌ అభినందించారు…

బాన్సువాడ, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్‌లో ‘యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ‘ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ’ వారు ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని’ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సభ్యుల‌కు, రక్తం దానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకుల‌ను అభినందించారు.

రక్తం ప్రాణాధారమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల‌లో డెలీవరీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. బాన్సువాడ ప్రాంతంలోని గర్భిణీలు, శిశువుల‌ కోసం పట్టణంలో ప్రత్యేకంగా 100 పడకల‌తో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామని, నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయని అన్నారు. రూ.3 కోట్లతో అత్యాధునిక పరికరాల‌ను ఏర్పాటు చేయబోతున్నామని, ఆసుపత్రి ప్రారంభం నాటికి సిబ్బందిని నియమిస్తామన్నారు.

బాన్సువాడ ప్రాంత ప్రజల‌ కోసం కోటి రూపాయల‌తో నూతన బ్లడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని, అదేవిధంగా బాన్సువాడ పట్టణంలో 20 పడకల‌ ఐసియు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బిబీ పాటిల్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, బాన్సువాడ పురపాల‌క సంఘం అధ్యక్షుడు జంగం గంగాధర్‌, జిల్లా జాయంట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో ...

Comment on the article