Breaking News

జిల్లాకు సుమారు 7,500 మంది ఇతర ప్రాంతాల‌ నుండి వచ్చారు

నిజామాబాద్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాతల‌ వారం సందర్భంగా టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌ ఆధ్వర్యంలో గోల్డెన్‌ జుబిలీ హల్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎల‌క్ట్రిసిటీ ఉద్యోగులు కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా పట్టణప్రగతి, పల్లెప్రగతిలో భాగంగా చాలా బాగా పనిచేసారని అభినందించారు. రక్త నిలువ‌లు తగ్గిపోతున్న సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.

కోవిడ్‌19 లో పనిచేస్తున్న వారు మాస్క్‌ ధరించడం, ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయడం, హ్యాండ్‌ వాష్‌ చేయడం అల‌వాటు చేసుకోవాల‌న్నారు. వ్యాక్సిన్‌ ఇంకా ఆల‌స్యమయ్యే అవకాశముందని, అలాగని పూర్తి లాక్‌ డౌన్‌ పాటించడం వ‌ల్ల‌ ఎంతమంది ఇబ్బందికి గురవుతారో చూస్తున్నామని, వర్షాలు మొదలైనప్పటి నుండి హాస్పిటల్‌కు వచ్చే రోగుల‌ సంఖ్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్తితిలో ఉద్యోగులు, పత్రికా మిత్రులు, సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

జిల్లాకు సుమారుగా 7 వేల‌ 500 మంది వేరు వేరు ప్రాంతాల‌నుండి రావడం జరిగిందని, ప్రతి ఒక్కరు కోవిడ్‌కు సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ పని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ డాక్టర్‌ రామ్‌ చందర్‌, సెక్రెటరీ ఆంజనేయులు, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డిఇ ఎండి ముక్తార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article